ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఎమ్మిగనూరు పంచాయతీ సద్దుమణిగిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి రచ్చకెక్కింది. ఇంతకుముందు ఎమ్మిగనూరు ఇంచార్జిగా మాచాని వెంకటేశ్వర్లను ప్రకటించిన వైసీపీ అధిష్టానం.. అతన్ని తప్పించబోతున్నారు. అయితే వైసీపీ క్యాడర్ లో వ్యతిరేకత రావడంతో మరోసారి మాచాని పై సర్వే చేయించింది అధిష్టానం. కాగా.. సర్వేలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో అధిష్టానం బుట్టా రేణుకను నియమించనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి అంగీకారంతో బుట్టా రేణుక నియామకం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మిగనూరు ఇంచార్జిగా మాజీ ఎంపీ బుట్టా రేణుక అధికారిక ప్రకటన వెలువడనుంది.
YCP: ఎమ్మిగనూరు వైసీపీ ఇంచార్జి మరోసారి మార్పు..

Yemmaganur