NTV Telugu Site icon

Chennakesava Reddy: చంద్రబాబు తర్వాత టీడీపీ మాయం..! ఎప్పటికైనా జూ.ఎన్టీఆరే టీడీపీ నాయకుడు..

Chennakesava Reddy

Chennakesava Reddy

Chennakesava Reddy: ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి మరో సారి కీలక కామెంట్లు చేశారు.. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌తో పాటు జూనియర్‌ ఎన్టీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండదని జోస్యం చెప్పారు.. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్‌ఆర్సీపీ)కి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)యే ప్రత్యామ్నాయంగా మారుతుందన్నారు. ఇక, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రపై సెటైర్లు వేసిన ఆయన.. పప్పు లోకేష్‌ ఇంకా పది పాద యాత్రలు చేసినా నాయకుడు కాలేడని వ్యాఖ్యానించారు.. లోకేష్ పాదయాత్రలో ఎమ్మెల్యేలకు పేర్లు పెడుతున్నాడు.. కానీ, మా మంత్రి ఆర్కే రోజా.. లోకేష్ కు పప్పు అని పేరు పెట్టిందని చెప్పుకొచ్చారు..

Read Also: Swetha Death Case Mystery: శ్వేత కేసులో మరో ట్విస్ట్‌.. వెలుగులోకి సంచలన విషయం..!

మరోవైపు.. ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆరే టీడీపీ నాయకుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు చెన్నకేశవరెడ్డి. చంద్రబాబు కుప్పం పర్యటనలో టీడీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ కావాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారని గుర్తుచేశారు.. టీడీపీ హయాంలో పేపర్ పై పనులు మంజూరు చేయడం, కమీషన్లు కొట్టడమే పని అంటూ ఆరోపించారు.. కానీ, సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాలన పారదర్శకంగా సాగుతోందని ప్రశంసలు కురిపించారు.. అయితే, ఎప్పటికైనా టీడీపీకి సినీ నటుడు జూనియర్ ఎన్టీఆరే నాయకుడు అవుతాడంటూ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.. కాగా, విపక్షాలకు కూడగట్టుకుని.. మరోసారి టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తుండగా.. ఇక, రాష్ట్రంలోని మొత్తం 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముందుకుసాగుతున్న విషయం విదితమే.