NTV Telugu Site icon

Vijayasai Reddy: ఈడీ విచారణకు హాజరైన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి!

Vijayasai Reddy

Vijayasai Reddy

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి విజయసాయిరెడ్డి వచ్చారు. కాకినాడ పోర్టు సెజ్‌కు సంబంధించిన కేసులో ఈడీ ఎదుట ఆయన విచారణకు ఆయన హాజరయ్యారు. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలపై వైసీపీ ఎంపీని ఈడీ అధికారులు ఎంత సేపు విచారణ చేస్తారో చూడాలి.

వైసీపీ హయాంలో కాకినాడ సీ పోర్ట్స్‌ లిమిటెడ్‌ (కేఎస్‌పీఎల్‌), కాకినాడ సెజ్‌ (కేసెజ్‌)ల్లోని రూ.3,600 కోట్ల విలువైన షేర్లను కేవీ రావు (కర్నాటి వెంకటేశ్వరరావు) నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. కాకినాడ సీ పోర్టు, కాకినాడ సెజ్‌లోని మేజర్ వాటాను బలవంతంగా తీసుకున్నారని కేవీ రావు ఫిర్యాదు చేశారు. రూ.2,500 కోట్ల విలువ చేసే 41 శాతం షేర్లను రూ.494 కోట్లకు, సెజ్‌లో రూ.1100 కోట్ల విలువ చేసే షేర్లను కేవలం రూ.12 కోట్లకు బలవంతంగా తీసుకున్నారని కేసు నమోదయింది.

కేఎస్‌పీఎల్‌, కేసెజ్‌ కేసుల్లో ఓ వైపు సీఐడీ దర్యాప్తు చేస్తుంటే.. మరోవైపు ఈడీ కూడా లావాదేవీలపై ఆరా తీసింది. మనీ లాండరింగ్ జరిగినట్టు గుర్తించిన ఈడీ.. కీలక వ్యక్తులపై కేసు నమోదు చేయడంతో పాటు నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డికి గతంలోనే నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని సూచించింది. అయితే పార్లమెంట్‌ సమావేశాల కారణంగా ఆయన హజరుకాలేదు. ఈడీ మళ్లీ నోటీసులు ఇవ్వడంతో నేడు ఆయన విచారణకు హాజరయ్యారు.

Show comments