NTV Telugu Site icon

R. Krishnaiah: జగన్ను మరో రెండుసార్లు గెలిపించుకోవాలి..

R Krishnaih

R Krishnaih

దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయని వైసీపీ రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య తెలిపారు. పేద వర్గాల కోసం చిత్త శుద్ధితో జగన్ పరిపాలన చేస్తున్నారు.. ఏపీలో జగన్ రాజ్యసభ సీట్లు కూడా బీసీలకు ఇచ్చారు.. జగన్ ధైర్యం వల్లే ఇది సాధ్యమని పక్క రాష్ట్రాల నేతలు అంటున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ, మంత్రి, రాజ్యసభ పదవుల్లో మెజార్టీ శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చినఘనత జగన్ దే అని తెలిపారు. జగన్ ను మరో రెండు సార్లు గెలిపించుకోవాల్సి ఉంది.. జగన్ ఓ సంఘ సంస్కర్త అంటూ ఎంపీ ఆర్. కృష్ణయ్య కొనియాడారు.

Read Also: Congress: హస్తం గూటికి చేరిన బీఎస్పీ సస్పెండ్ ఎంపీ

ఇక, బీసీలను ఓటు బ్యాంక్ గా చూడని వ్యక్తి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని వైసీపీ తూర్పు ఇంఛార్జి్ దేవినేని అవినాష్ అన్నారు. రాజ్యాధికారం బీసీలకు ఇవ్వాలనేది జగన్ లక్ష్యం అని చెప్పారు. బీసీల కోసం పోరాడిన ఆర్.కృష్ణయ్య ఈ విషయం గుర్తించారు.. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు బీసీల పట్ల ఎలా ప్రవర్తించారు అనేది అందరికీ తెలుసు అనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎస్సీ, ఎస్టీల పట్ల ఎలా ప్రవర్తించారు అనేది అందరికి తెలుసు అని అవినాష్ పేర్కొన్నారు.