Site icon NTV Telugu

YS Avinash Reddy: వైఎస్‌ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి హెల్త్ బులెటిన్ విడుదల.. మెరుగైన వైద్యం కోసం..

Avinash Reddy

Avinash Reddy

YS Avinash Reddy: కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మి తాజా హెల్త్‌ బులిటెన్‌ను కర్నూలు విశ్వభారతి వైద్యులు విడుదల చేశారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడుతోందని, ఆమెను ఇవాళే(శుక్రవారం) వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు. గుండె సంబంధిత ఇబ్బందితో బాధపడుతున్న ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలిస్తున్నారు. లోబీపీ, గుండెపోటుకు గురి కావడంతో ఆమెను ఈ నెల 19న విశ్వభారతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కొంచెం కోలుకున్నారు. వైద్యుల సూచనల మేరకు ఆమెను మెరుగైన ఆసుపత్రికి తరలిస్తున్నారు. శ్రీలక్ష్మి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈరోజు లక్ష్మమ్మను డిశ్చార్జ్‌ చేశాం. గుండె సంబంధిత చికిత్స కోసం వేరే ఆస్పత్రికి రిఫర్‌ చేస్తాం అని వైద్యులు ప్రకటించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించనున్నారు.

Read Also: AP CM Jagan: నరకాసురుడినైనా నమ్మండి.. కానీ నారా చంద్రబాబును నమ్మొద్దు..

మరోవైపు అవినాశ్ ముందస్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రారంభమయింది. అవినాశ్ తరపున లాయర్ ఉమామహేశ్వరరావు, సునీత తరపున సీనియర్ కౌన్సిల్ రవిచంద్ వాదనలు వినిపిస్తున్నారు. మరోవైపు సీబీఐ అడిషనల్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.

Exit mobile version