Site icon NTV Telugu

Andhrapradesh: సీఎం జగన్‌తో ఎంపీ అవినాష్ రెడ్డి భేటీ

Avinash Reddy

Avinash Reddy

Andhrapradesh: కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డితో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. వివేకా కేసు తాజా పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యకేసులో అవినాష్‌ రెడ్డిని సీబీఐ నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే. దీనిపై పలుమార్లు అవినాష్‌ను విచారించిన సీబీఐ అధికారులు కోర్టులో ఛార్జిషీట్‌ను కూడా దాఖలు చేశారు. సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో సీఎంతో అవినాష్‌ రెడ్డి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

Also Read: Heavy Rains: వరదల్లో వరంగల్ దిగ్బంధం.. బిల్డింగ్ లపై తలదాచుకున్న బాధితులు

Exit mobile version