NTV Telugu Site icon

MLA Thopudurthi Prakash Reddy: కాటికి కాలు చాచిన చంద్రబాబును చంపే అవసరం ఎవరికీ లేదు..

Mla Thopudurthi Prakash Reddy

Mla Thopudurthi Prakash Reddy

MLA Thopudurthi Prakash Reddy: తనను, లోకేష్‌ను చంపేస్తారట అంటూ మాట్లాడిన చంద్రబాబు మాటలకు రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాటికి కాలు చాచిన చంద్రబాబును చంపే అవసరం ఎవరికీ లేదని ఆయన అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే 150 హత్యలు జరిగాయని ఎమ్మెల్యే ఆరోపించారు. తనకు ప్రాణం హాని చేస్తారనే ఆందోళనతోనే తన అన్న తోపుదుర్తి చంద్రశేఖర్‌ రెడ్డి అలా మాట్లాడి ఉండొచ్చని ప్రకాష్‌ రెడ్డి వెల్లడించారు. పరిటాల రవి హయాంలో ఎన్ని హత్యలు జరిగాయో అందరికీ తెలుసన్నారు.

పరిటాల రవి అనుచరుడు జగ్గుతో అమ్మను తిట్టించారని.. కొడుకులుగా మాకు బాధ ఉండదా..? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని కల్గుతుందన్న బాధతో తన అన్న చంద్రశేఖర్‌ రెడ్డి అలా మాట్లాడి ఉండొచ్చని.. ఆయన మాట్లాడిన భాష మీద పెద్దలు మందలించారని.. క్షమాపణ కూడా చెప్పామన్నారు. మరి మా తల్లిని తిట్టిన దానికి ఒక్క టీడీపీ నేత అయినా తప్పు అని చెప్పారా అంటూ ప్రశ్నించారు. 3వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జనంలోకి వెళ్తామని ఆయన అన్నారు. వెళ్లిన ప్రతి చోటా తాము చేసిన అభివృద్ధి.. వారు చేస్తున్న అరాచకాలు చెప్తామని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. పరిటాల సునీత తిట్టించిన అంశాన్ని కూడా జనానికి చెబుతామన్నారు. పరిటాల రవి నేర చరిత్ర చూసి టీడీపీలో రాజకీయ పట్టాభిషేకం చేశారని.. తమ సోదరుడైన చంద్రశేఖర్ రెడ్డిని అప్పట్లో పరిటాల రవి చంపాలని చూశారని ఆరోపించారు. ఆ సమాచారం చెప్పిన వారిని ఎన్ కౌంటర్ చేయించాడని ఆరోపణలు చేశారు.

Chandrababu: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. ”నన్ను, లోకేష్‌ని కూడా చంపేస్తారట..”

మద్దెల చెరువు సూరి కుటుంబం మొత్తాన్ని రవి చంపించారని.. అందుకే సూరి రవిని చంపి ప్రతీకారం తీర్చుకున్నారని ఆరోపించాడు. 150హత్యలు చేసినా వారికి ఎందుకు శిక్ష పడలేదు.. ఎవరు కాపాడారని ప్రశ్నించాడు. 2009లో నన్ను ఓడించేందుకు.. జైలులో ఉన్న సూరీతో రాజీ పడ్డారని ఆయన పేర్కొన్నారు. సూరిని భానుతో చంపించింది పరిటాల సునీతనే అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు.