Pulivendula ZPTC By-Election: కడప జిల్లాలోని రెండు జడ్పీటీసీ స్థానాలకు జరుగుతోన్న ఉప ఎన్నికలు ఇప్పుడు కాకరేపుతున్నాయి.. మరీ ముఖ్యంగా పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా పోలింగ్ బూతుల వ్యవహారం తీవ్ర వివాదంగా మారింది.. రాష్ట్ర ఎన్నికల కమిషన్, కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అయితే, ఈ వ్యవహారం ఇప్పుడు హైకోర్టు వరకు వెళ్లింది.. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా పోలింగ్ బూతుల మార్పును సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది వైసీపీ.. ఈ రోజు వైసీపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరగనుంది.. ఎన్నికల సంఘానికి పోలింగ్ బూతుల మార్పుపై ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేసింది వైసీపీ.. మరి, హైకోర్టులో ఎలాంటి విచారణ జరగనుంది.. న్యాయస్థానం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయనుంది అనేది ఆసక్తికరంగా మారింది..
Read Also: Viral Video: హృదయ విదారక ఘటన.. బైక్‌పై భార్య మృతదేహం తరలింపు, నిస్సహాయంగా భర్త!
కాగా, రేపే పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల జరగనున్నాయి.. పులివెందుల ఎన్నికల బరిలో 11 మంది అభ్యర్థులు ఉండగా..మొత్తం 15 పోలింగ్ బూత్ లకు 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.. ఈ ఎన్నికల్లో 10,601 మంది ఓటర్లు.. తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.. ఇక, ఒంటిమిట్టలో ఎన్నికల బరిలో ఉన్న 11 మంది అభ్యర్థులు ఉండగా.. మొత్తం 30 పోలింగ్ బూత్ లకు గాను 17 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు.. ఒంటిమిట్టలో 24606 మంది ఓటర్లు ఉన్నారు.. ఈ రోజు సాయంత్రానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు పోలింగ్ సిబ్బంది.. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు 550 మంది పోలీసులు, 4 ప్లటూన్లు, ఏఆర్ పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయగా.. ఒంటిమిట్ట ఉప ఎన్నికల కు 650 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు..
