NTV Telugu Site icon

104 Vehicle: గ్రామంలోకి రాకుండా.. 104 వాహనాన్ని అడ్డుకున్న వైసీపీ నాయకుడు!

104 Vehicle

104 Vehicle

YCP Leader stopped the 104 Vehicle from entering the Village: నంద్యాల జిల్లా రుద్రవరం మండలం మందలూరులో వైసీపీ నాయకుడు శ్రీనివాస రెడ్డి వీరంగం సృష్టించాడు. వైద్య సేవలందించేందుకు వెళ్లిన 104 వాహనంతో పాటు వైద్య సిబ్బందిని అతడు అడ్డుకున్నారు. తన భార్య గ్రామ సర్పంచ్ అని, మా పర్మిషన్ లేకుండా గ్రామంలోకి ఎలా వస్తారని 104 వాహనంకు ట్రాక్టర్ అడ్డుగా పెట్టాడు. అంతేకాకుండా వైద్య సిబ్బందితో శ్రీనివాస రెడ్డి వాగ్వాదానికి దిగాడు.

Also Read: Parliament Attack: పార్లమెంట్ ఘటన నిందితుడి ఇంట్లో దొరికిన డైరీ.. వెలుగులోకి కీలక రహస్యాలు

వైసీపీ నాయకుడు శ్రీనివాస రెడ్డి గొడవకు దిగడంతో వైద్య సిబ్బంది వెనక్కి తగ్గారు. శ్రీనివాస్ రెడ్డి వింత తీరుపై స్థానికులు ఆగ్రహ వ్యక్తం చేశారు. 104 వాహనాన్ని శ్రీనివాస రెడ్డి అడ్డుకోవడం ఇది మొదటిసారి మాత్రం కాదు. గతంలో కూడా ఓసారి 104 వాహనాన్ని అతడు అడ్డుకున్నాడు. శ్రీనివాస రెడ్డి గొడవకు సంబందించిన వీడియోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వైద్య సేవలందించేందుకు వచ్చిన వారిని అడ్డుకున్న శ్రీనివాస రెడ్డిపై చర్చలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Show comments