Yatra 2 : ఓటీటీలోకి వచ్చేస్తున్న యాత్ర 2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Whatsapp Image 2024 02 23 At 2.43.20 Pm

Whatsapp Image 2024 02 23 At 2.43.20 Pm

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు రాబోతుందటంతో టాలీవుడ్‌లో పొలిటికల్ సినిమాల ట్రెండ్ కొనసాగుతుంది. ఈ ట్రెండ్‌లో ఇటీవలే ఏపీ సీఏం వైఎస్ జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన యాత్ర 2 మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది.వైఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ నటుడు జీవా నటించిన ఈ సినిమాలో మమ్ముట్టి గెస్ట్ రోల్‌లో కనిపించాడు. 2019లో రిలీజైన యాత్రకు సీక్వెల్‌గా దర్శకుడు మహి వి రాఘవ్ యాత్ర 2 మూవీని తెరకెక్కించాడు.ఫిబ్రవరి 8న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది.. సీఎం జగన్ గురించి అందరికి తెలిసిన కథనే దర్శకుడు ఈ సినిమాలో చూపించడం జరిగింది. జగన్ జీవితంలో 2009 నుంచి 2019 వరకు జరిగిన పరిణామాలతో దర్శకుడు మహి వి రాఘవ్ యాత్ర 2 సినిమాను తెరకెక్కించారు. తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీని జగన్ వదిలేయడానికి దారితీసిన పరిణామాలు అలాగే సొంత పార్టీ ఏర్పాటుతో పాటు ప్రజల మద్ధతుతో తొలిసారి సీఏంగా ఎలా ఎన్నికయ్యాడన్నది యాత్ర 2లో డైరెక్టర్ మహి వి రాఘవ్‌ ఎమోషనల్‌గా ఆవిష్కరించారు.

ఈ సినిమాలో చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్‌ మరియు వైఎస్ భారతి పాత్రలో కేతకీ నారయణన్ నటించారు. ఈ సినిమాలో సోనియా గాంధీ, కేవీపీ మరియు కొడాలి నానితో పాటు చాలా రియలిస్టిక్ క్యారెక్టర్స్‌ను ఈ సినిమాలో క్రియేట్ చేశారు. యాత్ర 2 మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించాడు.అయితే యాత్ర 2 ఓటీటీ రైట్స్ ఇంకా అమ్ముడుపోలేదని తెలిసింది. పొటిలిటికల్ మూవీ కావడంతో కాంట్రవర్సీలు ఉంటాయనే భయంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ యాత్ర 2 సినిమాను కొనడానికి ముందుకు రానట్లు తెలిసింది. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌తో దర్శకనిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.దాదాపుగా డీల్ ఒకే అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అమెజాన్‌ ప్రైమ్ వీడియోలోనే జగన్ బయోపిక్ రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.. . మార్చి సెకండ్ వీక్‌లో యాత్ర 2 ఓటీటీలో రానున్నట్లు సమాచారం.. త్వరలోనే యాత్ర 2 ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.