Yatra 2 : ఓటీటీలోకి వచ్చేస్తున్న యాత్ర 2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు రాబోతుందటంతో టాలీవుడ్‌లో పొలిటికల్ సినిమాల ట్రెండ్ కొనసాగుతుంది. ఈ ట్రెండ్‌లో ఇటీవలే ఏపీ సీఏం వైఎస్ జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన యాత్ర 2 మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది.వైఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ నటుడు జీవా నటించిన ఈ సినిమాలో మమ్ముట్టి గెస్ట్ రోల్‌లో కనిపించాడు. 2019లో రిలీజైన యాత్రకు సీక్వెల్‌గా దర్శకుడు మహి వి రాఘవ్ యాత్ర 2 మూవీని తెరకెక్కించాడు.ఫిబ్రవరి 8న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది.. సీఎం జగన్ గురించి అందరికి తెలిసిన కథనే దర్శకుడు ఈ సినిమాలో చూపించడం జరిగింది. జగన్ జీవితంలో 2009 నుంచి 2019 వరకు జరిగిన పరిణామాలతో దర్శకుడు మహి వి రాఘవ్ యాత్ర 2 సినిమాను తెరకెక్కించారు. తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీని జగన్ వదిలేయడానికి దారితీసిన పరిణామాలు అలాగే సొంత పార్టీ ఏర్పాటుతో పాటు ప్రజల మద్ధతుతో తొలిసారి సీఏంగా ఎలా ఎన్నికయ్యాడన్నది యాత్ర 2లో డైరెక్టర్ మహి వి రాఘవ్ ఎమోషనల్‌గా ఆవిష్కరించారు.
ఈ సినిమాలో చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్ మరియు వైఎస్ భారతి పాత్రలో కేతకీ నారయణన్ నటించారు. ఈ సినిమాలో సోనియా గాంధీ, కేవీపీ మరియు కొడాలి నానితో పాటు చాలా రియలిస్టిక్ క్యారెక్టర్స్‌ను ఈ సినిమాలో క్రియేట్ చేశారు. యాత్ర 2 మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించాడు.అయితే యాత్ర 2 ఓటీటీ రైట్స్ ఇంకా అమ్ముడుపోలేదని తెలిసింది. పొటిలిటికల్ మూవీ కావడంతో కాంట్రవర్సీలు ఉంటాయనే భయంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ యాత్ర 2 సినిమాను కొనడానికి ముందుకు రానట్లు తెలిసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌తో దర్శకనిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.దాదాపుగా డీల్ ఒకే అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే జగన్ బయోపిక్ రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.. . మార్చి సెకండ్ వీక్‌లో యాత్ర 2 ఓటీటీలో రానున్నట్లు సమాచారం.. త్వరలోనే యాత్ర 2 ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read
- Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
- Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
- Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి...
తాజావార్తలు
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!