NTV Telugu Site icon

Yasmin Basha : అధికారులపై జిల్లా కలెక్టర్‌ ఫైర్‌

Yasmin Basha

Yasmin Basha

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో మంగళవారం జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష పర్యటించారు. ఆరోగ్య లక్ష్మి పథకాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు అనంతరం సిజేరియన్ తగ్గించి నార్మల్ డెలివరీ ప్రోత్సహించేలా అధికారులకు సూచించారు. అనంతరం అక్కడి నుండి మన ఊరు మనబడి పథకంలో భాగంగా మండల కేంద్రంలో చేపడుతున్న పనులను పరిశీలించారు. పనులు అస్తవ్యస్తంగా ఉండడంతో మన ఊరు మనబడి పనులు సరిగ్గా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి పథకాల రూపొందిస్తుంటే అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో డబ్బులు వృధా అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజుల్లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

Also Read : Upasana: బేబీ బంప్ తో ఉపాసన.. పుట్టబోయే బిడ్డ గురించి చరణ్ ఏమన్నాడంటే

అనంతరం పదవ తరగతి చదువుతున్న విద్యార్థినీ విద్యార్థుల దగ్గరికి వెళ్లి స్టూడెంట్ల నుండి భోజన వివరాలు చదువు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ స్థానిక హెచ్ఎం లను మంచి ఆహారం అందించాలని నాణ్యమైన విద్యను అందించి 100% ఉత్తీర్ణత సాధించేలా చూడాలని ఆదేశించారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో తెలుగులో ఎలా మాట్లాడిస్తున్నారని ఎంఈఓ పై ఆగ్రహం వ్యక్తం చేసింది కాసేపు ఉపాధ్యాయులకే పాఠాలు చెప్పినట్లు చేసింది నా గురించి మీకు పూర్తిగా తెలియదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా అందించాలని ఆదేశాలు జారీ చేసింది అనంతరం స్థానిక గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలించారు.