Toxic Postpone : ‘టాక్సిక్’ జూన్ రిలీజ్ వాయిదా వార్తలపై మేకర్స్ క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ . అయితే గత కొద్దిరోజులుగా ఈ సినిమా విడుదల వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మొదట మార్చి 19న విడుదల కావాల్సిన ఈ చిత్రం, కొన్ని కారణాల వల్ల జూన్ 4వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఇప్పుడు జూన్ లో కూడా రావడం లేదంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
Also Read : Music Directors Flops : వరుస ఫ్లాపుల్లో అగ్ర సంగీత దర్శకులు.. క్యాచీ ట్యూన్స్ కరువయ్యాయా?
Also Read
- Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
- FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
- Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. 'జై జవాన్ జై కిసాన్' రూపశిల్పి శాస్త్రి జీ..
- Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
ఈ ప్రచారాన్ని చిత్ర యూనిట్ తీవ్రంగా ఖండించింది. జూన్ 4న సినిమా రావడం లేదంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ‘టాక్సిక్’ టీం స్పష్టం చేస్తూ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, చెప్పిన డేట్ కు సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కేవలం పుకార్లను నమ్మి అభిమానులు ఆందోళన చెందవద్దని వారు కోరారు. మరోవైపు యశ్ తన క్రేజ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే పనిలో ఉన్నారు. అమెరికాలో ప్రతిష్టాత్మకంగా జరిగే ‘సినిమాకాన్‘ ఈవెంట్‌కు యశ్ హాజరయ్యాడు. అక్కడ ‘టాక్సిక్’ చిత్రంతో పాటు ఆయన నటిస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ ‘రామాయణ‘ కి సంబంధించిన వరల్డ్ వైడ్ ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ‘రామాయణ’లో యశ్ రావణాసురుడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు ‘టాక్సిక్’ షూటింగ్, మరోవైపు ‘రామాయణ’ ప్రమోషన్లతో యశ్ బిజీ బిజీగా గడుపుతున్నారు. రావణాసురుడిగా యశ్ లుక్ ఎలా ఉండబోతుందో అని అటు బాలీవుడ్, ఇటు సౌత్ సినీ ప్రియులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రమోషన్ల విషయంలో యశ్ తీసుకుంటున్న జాగ్రత్తలు చూస్తుంటే ఈ రెండు సినిమాలు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?