NTV Telugu Site icon

Yashoda Hospital Gold Theft case: పార్క్ చేసిన కారులో గోల్డ్ చోరీ కేసుని చేధించిన పోలీసులు

Madhapur 1

Madhapur 1

హైదరాబాద్ నగరంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఈ నెల 27న మాదాపూర్ ఖానామెట్ వద్ద గల యశోద హాస్పిటల్ ముందు పార్క్ చేసిన కారులో బంగారం చోరీకి గురైంది. ఈ గోల్డ్ దొంగతనం కేసును మాదాపూర్ పోలీసులు చేధించారు. యశోద హాస్పిటల్ లో పనిచేస్తున్న ఓ డాక్టర్ డ్రైవరే ఈకేసులో నిందితుడు అని పోలీసులు తెలిపారు. ఒకరిని అరెస్ట్ చేసి 12 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ శిల్పవల్లి మీడియాకు వెల్లడించారు.

ఈ నెల 27 న జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి యశోద హాస్పిటల్ లోపలికి వెళ్లి వచ్చేసరికే తన కారులో ఉన్న గోల్డ్ మిస్ అయిందని మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అదే హాస్పిటల్ లో పనిచేస్తున్న డాక్టర్ విజయ్ మోహన్ కారు డ్రైవరు మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ చోరీ చేసినట్లు తేలింది. కారు గ్లాస్ డోరు కొంచెం తీసి ఉండడంతో చోరీకి పాల్పడ్డాడు ఇమ్రాన్ ఖాన్. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని డీసీపీ శిల్పవల్లి తెలిపారు.

కరీంనగర్‌ లో భర్తను హతమార్చిన భార్య

కరీంనగర్ జిల్లాలో ఘోరం జరిగింది. ఓ భర్త భార్యను చంపేసింది. కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోతిరంపూర్ లో ఈ దారుణం జరిగింది. భర్తను హత్య చేసిన భార్య ఉదంతం కలకలం రేపుతోంది. భర్త గడ్డి గంగయ్య రోజు తాగి వచ్చి భార్య గంగవ్వను వేధింపులకు గురిచేస్తుండడంతో తట్టుకోలేక రాడ్ తో తలపై దాడి చేసింది భార్య. స్పాట్ లోనే మృతి చెందాడు భర్త గడ్డి గంగయ్య. ఆయన వయసు 50 సంవత్సరాలు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గంగవ్వను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Show comments