Site icon NTV Telugu

Samanta Craze: అబ్బా.. సమంత కటౌట్ అదిరిపోయింది

Samanta

Samanta

Samanta Craze: యంగ్ హీరో నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం యశోద. ఈ సినిమా నవంబర్ 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హ‌రీష్ శంక‌ర్‌, హ‌రీష్ నారాయ‌ణ్ సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ సినిమా ఫై భారీ అంచనాలు పెంచేశాయి.

Read Also: Adipurush release date: ఆదిపురుష్ న్యూ అప్డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చకు రెడీగా ఉండండి

ఇక సరోగసీ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న యశోద మూవీలో సమంత టైటిల్ రోల్‌ని పోషించగా.. శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై నిర్మించారు. సమంతతో పాటు ఈ సినిమాలో ఉన్ని ముకుందన్, సంపత్ రాజ్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్ తదితరులు నటించారు. ఇక రిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని ‘సుదర్శన్ 35 ఎంఎం థియేటర్’ వద్ద సమంత అభిమానులు భారీ కటౌట్‌ ఏర్పాటు చేశారు. ‘ఓ బేబీ’ సినిమా రిలీజ్‌కి కూడా సమంత కటౌట్‌ని ‘దేవీ 70 ఎంఎం’ థియేటర్ వద్ద ఏర్పాటు చేశారు. ఇక సమంత అటు బాలీవుడ్ లోను పలు ప్రాజెక్టుల్లో నటిస్తోంది. తెలుగులో శాకుంతలం, విజయ్ దేవరకొండ సినిమా ‘ఖుషి’లో నటిస్తుంది. యశోద మూవీ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత సమంత తనకి ‘మయోసైటిస్‌’ వ్యాధి ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ మూవీకి సంబంధించిన డబ్బింగ్ వర్క్‌ని సెలైన్ సాయంతో పూర్తి చేస్తున్న ఫొటోని సమంత షేర్ చేసింది.

Exit mobile version