NTV Telugu Site icon

Yashasvi Jaiswal: టాప్ ప్లేయర్లను కాదని ఐసీసీ అవార్డును కైవసం చేసుకున్న యశస్వి జైస్వాల్..!

Yashasvi Jaiswal

Yashasvi Jaiswal

Yashasvi Jaiswal: ప్రస్తుత టీమిండియా ఓపెనర్ య‌శ‌స్వి జైస్వాల్ క్రికెట్ చరిత్రలో రికార్డుల మోత మోగిస్తున్నాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తాజాగా ముగిసిన టీమిండియా, ఇంగ్లాండ్ టీంల మధ్య జరిగిన టెస్టు సిరీస్ లో యశస్వి జైస్వాల్ ప‌రుగుల వ‌ర‌ద పారించడంతో అనేక కొత్త రికార్డులను సృష్టించాడు. తాజాగా ముగిసిన 5 మ్యాచ్‌ ల టెస్ట్ సిరీస్‌ లో భాగంగా బ్యాట్‌తో విధ్వంసం సృష్టించి ఇంగ్లాండ్ బౌలర్లని ఉతికిపారేశాడు. ఇందులో ముఖ్యంగా వరుస డబుల్ సెంచరీలు సాధించిన యంగ్ ప్లేయ‌ర్ గా జైస్వాల్ రికార్డు బ‌ద్దలు కొట్టాడు.

Read Also: Salman Khan : ఆ సౌత్ స్టార్ డైరెక్టర్ తో కొత్త సినిమా ప్రకటించిన సల్మాన్ ఖాన్..

ఇక, ఈ సిరీస్‌ లో యశస్వి జైస్వాల్ 712 ర‌న్స్ చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఎంతో అద్భుత‌మైన ఆట‌తీరుతో ముందుకు వెళ్తున్న య‌శ‌స్వి జైస్వాల్ ను తాజాగా ఐసీసీకి చెందిన అవార్డు వ‌రించింది. ఇక ఈ విషయం చూస్తే.. ఫిబ్రవరి నెలకు గానూ జైస్వాల్ ను ” ప్లేయర్ ఆఫ్ ది మంత్ ” గా ఐసీసీ ఎన్నుకుంది. ఇక ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డు కొరకు జైస్వాల్‌ తో పాటు న్యూజిలాండ్ నుండి కేన్ విలియమ్సన్, శ్రీలంక నుండి పాతుమ్ నిస్సాంకలు గట్టి పోటీ ఇచ్చారు. ముందుగా ఈ ముగ్గురు ఆటగాళ్లను ప్లేయర్ ఆఫ్ ది మంత్‌ గా ఐసీసీ నామినేట్ చేయగా.. ఇందులో న్యూజిలాండ్‌ కు చెందిన కేన్ విలియమ్సన్, శ్రీలంకకు చెందిన పాతుమ్ నిస్సాంకల‌ను వెన‌క్కినెట్టి జైస్వాల్ ఈ ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డును గెలుపొందాడు.

Read Also: Rashmika Mandanna : రష్మిక మందన్న మరో డీప్ ఫేక్ వీడియో వైరల్..

ముందుముందు ప్రపంచంలోనే అత్యుత్తమ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌ గా యశస్వి జైస్వాల్ రాణిస్తాడని అతని గణాంకాలు చెబుతున్నాయని ఐసీసీ ఈ సంద‌ర్భంగా తెలిపింది. ఇక ప్రస్తుతం నడుస్తున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడని ఐసీసీ పేర్కొంది. గడిచిన నెలలో ఇంగ్లండ్‌ పై వరుస మ్యాచ్‌ లలో ఏకంగా రెండు అద్భుతమైన డబుల్ సెంచరీలను సాధించాడు. మొదటి డబుల్ సెంచరీ విశాఖపట్నంలో జరిగిన టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 219 పరుగులు చేసాడు., ఆఫై రాజ్‌ కోట్‌ లో జరిగిన మరుసటి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌ లో డబుల్ సెంచరీని సాధించాడు. ఇకపోతే యశస్వి జైస్వాల్ కేవలం వరుస డ‌బుల్ సెంచ‌రీలు మాత్ర‌మే కాకుండా ఫిబ్రవరి మాసంలో జైస్వాల్ అనేక రికార్డులను కొల్లగొట్టాడు.