IND vs ENG: విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్ తో జరగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. 277 బంతుల్లో 18 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 200 పరుగుల మార్క్ అందుకున్నాడు. మరో వైపు ఇవాళ తొలి సెషన్ ప్రారంభమైన కాసేపటికే రవిచంద్రన్ అశ్విన్ (20) అవుట్ అయ్యాడు. కుల్దీప్ యాదవ్ తో కలిసి జైస్వాల్ ఇన్సింగ్స్ కొనసాగిస్తున్నారు.
Read Also: Poonam Pandey : ‘పూనమ్ బతికే ఉంది.. పబ్లిసిటీ స్టంట్ చేసింది’.. ట్వీట్ చేసిన ఉమైర్ సంధు
అయితే, యశస్వి జైస్వాల్ తన టెస్టు కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. తొలి రోజు భారత్ 6 వికెట్లకు 336 పరుగులు చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి యశస్వి జైస్వాల్ 179 పరుగులు, అశ్విన్ 5 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. ఈరోజు భారత జట్టు తన స్కోరును 400 దాటించేందుకు ప్రయత్నిస్తుండగా జైస్వాల్ తన మొదటి డబుల్ సెంచరీని సాధించాడు. ఇప్పటి వరకు షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్ రెహాన్ అహ్మద్ తలో రెండు వికెట్లు తీసుకోగా.. టామ్ హార్ట్లీ ఒక్క వికెట్ తీసుకున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 7 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది.