NTV Telugu Site icon

Yashasvi Jaiswal: వామ్మో.. జైస్వాల్ మామూలోడు కాదుగా.. ఆస్ట్రేలియా ఆటగాళ్లనే కవ్వించాడుగా (వీడియో)

Yashasvi Jaiswal

Yashasvi Jaiswal

Yashasvi Jaiswal: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో మొదటి టెస్ట్ లో టీమిండియా స్వల్ప ఆధిక్యాన్ని కనపరిచింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ లు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. రెండో ఇన్నింగ్స్ లో ఒక్క వికెట్ పడకుండా రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 172 పరుగులు సాధించింది. దీంతో టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 218 పరుగులతో భారీ ఆధిక్యంతో నిలిచింది. ఇకపోతే ఇంత భారీ లీడ్ రావడానికి యశస్వి జైస్వాల్ వ్యవహరించిన ఆట తీరు ఇప్పుడు అందరిని ఇప్పుడు అందరిని ఆశర్యపరుస్తుంది. యశస్వి జైస్వాల్ ఎప్పుడు లేనంతగా తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకోవడానికి 122 బంతులను ఎదుర్కొన్నాడు. ఇంత నెమ్మదిగా అర్థ సెంచరీ పూర్తి చేసిన నిజానికి అతడు చూపిన ఓపికకు టీమిండియా భారీ ఆధిక్యాన్ని అందుకుంది. రెండు రోజు ఆట ముగిసే సమయానికి జైస్వాల్ 90 పరుగుల ఇన్నింగ్స్ తో నాటౌట్ గా ఉన్నాడు. యశస్వి జైస్వాల్ మొదటిసారి ఆస్ట్రేలియా పర్యటనకు టెస్టు సీరిస్ లో భాగంగా వెళ్ళాడు. అయితే, ఆస్ట్రేలియా మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న అతను మొదటి ఇన్నింగ్స్ లో డకట్ గా వెనుతిరిగాడు.

Also Read: IPL 2025 Mock Auction: ఐపీఎల్ మాక్ వేలంలో రికార్డ్ ధరలకు అమ్ముడుబోయిన రిషబ్ పంత్, కేఎల్ రాహుల్

ఇది ఇలా ఉండగా.. రెండో ఇన్నింగ్స్ సమయంలో జైశ్వాల్ క్రీజ్ లో ఉన్న సమయంలో మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ఓ అద్భుతమైన ఫోర్ సాధించాడు. దాని తర్వాత బంతిని హాఫ్ స్టంప్ బయటకు మిచెల్ స్టార్క్ బంతిని వేసాడు. దాని తర్వాత స్టార్క్ యశస్వి జైస్వాల్ కు ఏదో చెప్పగా అందుకు జైస్వాల్ తగిన సమాధానం ఇచ్చాడు. “నీ బాల్ చాలా నెమ్మదిగా వస్తోంది” అంటూ జైస్వాల్ రెచ్చగొట్టాడు. ఇక మరోసారి మార్నస్ లాబుషాగ్నేతో చాలా సరదాగా చేశాడు. ఇన్నింగ్స్ 44 ఓవర్లో జైస్వాల్ క్రీజ్ బయట ఉండగా.. మార్నస్ లాబుషాగ్నే చేతిలో బాల్ ఉన్న సమయంలో క్రేజీ బయట నిలబడి స్టంప్స్ ను కొట్టమని కోరాడు. దాంతో అతడు రెండు మూడుసార్లు బాల్ త్రో వెయ్యడం, ఆగిపోవడంతో అక్కడ కొద్దిసేపు సరదా సన్నివేశం జరిగింది. ఈ వీడియోలను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు అబ్బో.. జైస్వాల్ బుడ్డోడే గాని.. గట్టోడు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Show comments