Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!

Yashasvi Jaiswal

Yashasvi Jaiswal

Yashasvi Jaiswal: టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచాడు. క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పరుగులేమీ చేయకుండానే డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే, ఈ వైఫల్యంతో అతడి ఖాతాలో ఓ చెత్త రికార్డు నమోదైంది. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (SENA) దేశాలన్నింటిలోనూ డకౌట్ అయిన తొలి భారత బ్యాటర్‌గా జైస్వాల్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ జాబితాలో ఐదుగురు భారత ఆటగాళ్లు ఉన్నప్పటికీ వారంతా బౌలర్లే కావడం విశేషం. జైస్వాల్ తన టెస్ట్ కెరీర్‌లో ఇప్పటివరకు ఎనిమిదోసారి డకౌట్ అయ్యాడు.

జైస్వాల్ కంటే ముందు SENA దేశాలన్నింటిలోనూ డకౌట్ అయిన భారత ఆటగాళ్ల జాబితాలో అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. వీరంతా ప్రధానంగా బౌలర్లుగా గుర్తింపు పొందినవారే. వీరిలో ఒక్కరు కూడా ఆల్‌రౌండర్‌ కూడా లేరు. దీంతో ఈ నాలుగు దేశాల్లోనూ డకౌట్ అయిన తొలి రెగ్యులర్ భారత బ్యాటర్‌గా యశస్వి జైస్వాల్ ఈ జాబితాలో చేరిన మొదటి భారతీయుడిగా నిలిచిపోనున్నాడు.