Site icon NTV Telugu

Yashasvi Jaiswal: జైస్వాల్ ఏంటి కథ.. ఆ ముద్దులు ఎవరికి!

Jaiswal Flying Kisses

Jaiswal Flying Kisses

Yashasvi Jaiswal Celebrates Century with Flying Kisses : ఇంగ్లండ్‌తో ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదవ టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుత శతకం బాదాడు. అట్కిన్సన్ వేసిన 51 ఓవర్‌లో రెండో బంతికి సింగిల్ తీసి సెంచరీ మార్క్ అందుకున్నాడు. 127 బంతుల్లో 11 ఫోర్లు 2 సిక్సర్లతో శతకం పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్‌కు ఇది టెస్టులో 6వ టెస్ట్ సెంచరీ కాగా.. ఇంగ్లండ్‌పై నాలుగో శతకం. సెంచరీ అనంతరం జైస్వాల్ చేసుకున్న సంబరాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సెంచరీ అనంతరం యశస్వి జైస్వాల్ తనదైన శైలిలో సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. గాల్లోకి ఎగిరి పంచ్ ఇచ్చాడు. ఆపై గ్యాలరీ వైపు చూస్తూ.. ముద్దుల వర్షం కురిపించాడు. అంతేకాదు లవ్ సింబల్ కూడా చూపించాడు. గతంలోనూ జైస్వాల్ ఇలానే సెలెబ్రేషన్స్ చేసుకునా.. ఈ సారి లవ్ సింబల్ చూపించడం నెట్టింట చర్చనీయాంశమైంది. ‘జైస్వాల్ ఏంటి కథ’, ‘జైస్వాల్ ఆ ముద్దులు ఎవరికి’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఈ మ్యాచ్ చూడ్డానికి యశస్వి తల్లిదండ్రులు ఓవల్ మైదానంకు వచ్చారు. వారి కోసమే సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. అంతేకాదు తన సెంచరీని స్టేడియంకు వచ్చిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు అంకితం ఇచ్చాడు.

Also Read: Dimple Hayathi: శారీలో చందమామలా.. డింపుల్ పిక్స్ చూడాల్సిందే!

రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 164 బంతుల్లో 118 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ 84 ఓవర్లలో 9 వికెట్స్ కోల్పోయి 357 రన్స్ చేసింది. ప్రసిద్ధ్‌ కృష్ణ (0), వాషింగ్టన్ సుందర్ (17) క్రీజులో ఉన్నారు. భారత్ ఆధిక్యం 341కు చేరుకుంది. సుందర్ మరిన్ని రన్స్ చేస్తే.. భారత్ గెలుపుపై ఆశలు రెట్టింపవుతాయి. సిరీస్ ఫలితం టీమిండియా బౌలర్లపై ఆధారపడి ఉంది.

Exit mobile version