Yashasvi Jaiswal buys Rs 5.4 Crore Home in Mumbai: టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ వాణిజ్య రాజధాని ముంబైలో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అత్యంత ఖరీదైన బాంద్రా ప్రాంతంలో ఓ ఫ్లాట్‌ను కొనుగోలు చేశాడట. ఈస్ట్ బాంద్రాలో వింగ్ 3 ఏరియాలోని 1100 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఫ్లాట్‌ను యశస్వి కొన్నాడట. దీని ధర దాదాపు రూ. 5.4 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. 2024 జనవరి 7న జైస్వాల్ పేరిట కొనుగోలుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైనట్లు తెలుస్తోంది. అదానీ రియల్టీకి చెందిన బిల్డర్స్ నిర్మించిన ఈ నివాస స్థలంలో చదరపు అడుగు ధర రూ. 48 వేలుగా ఉంది.
22 ఏళ్ల యశస్వి జైస్వాల్ చిన్నపటినుంచి చాలా కష్టాలను అనుభవించాడు. 2001 డిసెంబరు 28న ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన యశస్వికి చిన్నతనం నుంచే క్రికెట్ అంటే పిచ్చి. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా అతడికి పెద్దగా ప్రోత్సాహం లభించలేదు. అయితే యశస్వి 13 ఏళ్ల వయసులో సొంతూరు భదోయిని వీడిన అతడి కుటుంబం ముంబైకి మకాం మార్చారు. ముంబైకి వచ్చిన కొత్తలో అతడు టెంట్‌లో నివసించేవాడు. డబ్బు కోసం పలు దుకాణాల్లో పనిచేసేవాడు. బాగా ఆడుతున్న యశస్విని కోచ్ జ్వాలా సింగ్ చేరదీశాడు. అక్కడ తన నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకున్న యశస్వి.. ముంబై అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు.
Also Read: WPL 2024: డబ్ల్యూపీఎల్ 2024 ఓపెనింగ్ సెర్మనీ.. షారుఖ్ స్పెషల్ పర్ఫామెన్స్!
అండర్-19, దేశవాళీ టోర్నీలలో అదరగవుతాడంతో ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు ఆడే అవకాశం వచ్చింది. ఎలాంటి బెరుకు లేకుండా.. బౌండరీలతో రెచ్చిపోయాడు. రాజస్థాన్ తరఫున 2023 సీజన్‌లో 14 మ్యాచుల్లోనే 625 పరుగులు చేశాడు. దాంతో టీమిండియాలో చోటు దక్కింది. గతేడాది వెస్టిండీస్ పర్యటనతో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ బాది తానేంటో నిరూపించుకున్నాడు. తాజాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ వరుసగా సెంచరీలు బాదాడు. మూడు టెస్టుల్లోనే 545 పరుగులు సాధించాడు. ఇందులో రెండు ద్విశతకాలు ఉన్నాయి.