NTV Telugu Site icon

Yashasvi Jaiswal Record: టీ20ల్లో కనివినీ ఎరుగని రికార్డు.. మన యశస్వి జైస్వాల్ సొంతం!

Yashasvi Jaiswal Record

Yashasvi Jaiswal Record

Yashasvi Jaiswal smashes world record in T20Is: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కనివినీ ఎరుగని రికార్డు నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో తొలి బంతికే 13 రన్స్ రాబట్టిన తొలి బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. జింబాబ్వేతో ఆదివారం జరిగిన ఐదో టీ20లో యశస్వి ఈ ఫీట్ నమోదు చేశాడు. 21 ఏళ్ల టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ బ్యాటర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు. ప్రస్తుతం ఈ రికార్డుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఐదో టీ20లో మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ బ్యాటింగ్‌కు దిగింది. మొదటి ఓవర్‌ను జింబాబ్వే కెప్టెన్ సికందర్ రాజా వేశాడు. మొదటి బంతిని నోబాల్‌గా వేయగా.. యశస్వి జైస్వాల్ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. బంతి నడుము కంటే ఎత్తులో రావడంతో అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. ఫ్రీ హిట్‌గా వేసిన బంతిని జైస్వాల్ స్ట్రైట్‌గా సిక్సర్ బాదాడు. దాంతో ఒక బంతికే 13 పరుగులు లభించాయి. దాంతో తొలి బంతికే 13 రన్స్ రాబట్టిన తొలి బ్యాటర్‌గా యశస్వి చరిత్రకెక్కాడు.

Also Read: Carlos Alcaraz: 11 ఏళ్ల వయసులోనే చెప్పా: కార్లోస్‌ అల్కరాస్‌

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 రన్స్ చేసింది. సంజూ శాంసన్ (58; 45 బంతుల్లో 1×4, 4×6) హాఫ్ సెంచరీ చేయగా.. శివమ్ దూబే (26; 12 బంతుల్లో 2×4, 2×6) రాణించాడు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబని రెండు వికెట్లు పడగొట్టాడు. చేధనలో జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌటైంది. మైయర్స్‌ (34; 32 బంతుల్లో 4×4, 1×6) టాప్‌ స్కోరర్‌. ముకేశ్‌ (4/22), దూబె (2/25) రాణించారు. దూబే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఇక వాషింగ్టన్‌ సుందర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా ఎంపికయ్యాడు.