NTV Telugu Site icon

Yash 19: కొత్త సినిమా ప్రకటించిన యష్ .. టైటిల్ టీజర్ ఎప్పుడంటే.. ?

Yash

Yash

Yash 19: కెజిఎఫ్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు కన్నడ అహీరో యష్. ఈ సినిమా తరువాత ఇప్పటివరకు మరో సినిమా ప్రకటించింది లేదు. కెజిఎఫ్ రిలీజ్ అయ్యి ఏడాది దాటింది. అదుగో సినిమా.. ఇదుగో సినిమా అంటూ ఏడాది గడిపేశాడు. మధ్యలో యాడ్స్ చేస్తూ, ఈవెంట్స్ లో కనిపిస్తూ అభిమానులను పలకరించినా కూడా తదుపరి సినిమా ఎప్పుడు అనేది అభిమానుల మైండ్ లో మెదులుతున్న ప్రశ్న. ఇక కెజిఎఫ్ తరువాత.. అంతకు మించిన కథతోనే రావాలని మంచి కథ దొరికేవరకు ఎదురుచూసి.. యష్ 19 ను అనౌన్స్ చేస్తాడని చెప్పుకొచ్చారు. ఎట్టేకలకు ఆ తరుణం వచ్చేసింది.

యష్ 19 ను యష్ ప్రకటించాడు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. రేపు ఉదయం 9.55 నిమిషాలకు యష్ 19 టైటిల్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా తెలిపారు. ఇక ఈ సినిమా అనౌన్స్ అవ్వకముందే ఈ చిత్రం నుంచి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ చిత్రంలో యష్ సరసన సాయి పల్లవి నటిస్తుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. సాయి పల్లవి తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు ఉండనున్నారని తెలుస్తోంది. ఇక దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నీ తాకుతున్నాయి. ఈ సినిమా టైటిల్ ఏమై ఉంటుందో అని.. యష్ లుక్ ఎలా ఉంటుందో అని అభిమానులు ఇప్పటికే గాల్లో మేడలు కట్టేస్తున్నారు. మరి ఈ సినిమాతో యష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Show comments