NTV Telugu Site icon

Yash : అసిస్టెంట్ ఇంటికి వెళ్లి సర్ ప్రైజ్ ఇచ్చిన యష్.. ఫోటోలు వైరల్..

Yash (2)

Yash (2)

కన్నడ స్టార్ హీరో రాఖీ భాయ్ అలియాస్ యష్ పేరు తెలియని వాళ్లు ఉండరు.. కేజీఎఫ్ సిరీస్ తో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. దీంతో తన పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది.. ఆ సినిమాల తర్వాత మరో సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. కానీ యష్ మాత్రం కథల విషయం లో కాస్త జాగ్రత్త తీసుకుంటున్నాడు.. ప్రస్తుతం ‘టాక్సిక్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. కాగా.. ఇంత బిజీ టైమ్ లో కూడా తన వ్యక్తిత్వాన్ని మరోసారి చాటుకున్నాడు.. తన అసిస్టెంట్స్ కు జీతాలు ఇవ్వడమే కాదు.. వాళ్లను కూడా తన సొంత మనుషుల్లాగ చూసుకుంటాడు..

ఎవరైన కష్టంలో ఉన్నారు అంటే అసలు తట్టుకోలేరు.. అందుకే కన్నడ ప్రజలు యష్ పై విపరీతమైన అభిమానాన్ని పెంచుకున్నారు… క్రమంలోనే తన అసిస్టెంట్ ఇంటికి సడెన్ గా వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చాడు. అంతేకాదు బాబుకు గిఫ్ట్ కూడా ఇచ్చాడు..తాజాగా కన్నడ రాకింగ్ స్టార్ యశ్ తన అసిస్టెంట్ చేతన్ కు ఊహించని సర్ఫ్రైజ్ ఇచ్చాడు.. అతనికి ఇటీవలే కొన్ని రోజుల క్రితం బాబు పుట్టాడు.. ఆ సమయం లో షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల పెద్దగా పట్టించుకోలేదు.. తర్వాత తానే స్వయంగా వెళ్లి బాబును ఎత్తుకున్నాడు..

అంతేకాదు బాబుకు బంగారు గొలుసును కూడా కానుకగా ఇచ్చాడు.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. నెటిజన్లు యశ్ సింప్లిసిటీపై అలాగే గోల్డ్ చైన్ బహుమతిగా ఇవ్వడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి మరోసారి తన మంచి మనసును చాటుకున్న యష్ పై నెటిజన్లు ఆయన ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఆ వీడియోను మీరు ఒకసారి చూసేయ్యండి..

Show comments