Yash Toxic Teaser: వంద కోట్లు కొల్లగొట్టడం గగనం అనుకునే కన్నడ చిత్ర సీమలో హీరో యశ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిజానికి శాండిల్ వుడ్ స్టాండర్డ్స్ మార్చేసిన కన్నడ స్టార్‌గా ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. కేజీఎఫ్‌తో రూ.250 కోట్లు, కేజీఎఫ్2తో రూ. 1200 కోట్లతో కలెక్షన్ల సునామీ సృష్టించి కన్నడ ఇండస్ట్రీకి ఓ సరికొత్త గుర్తింపు తెచ్చాడు యష్. ఈ గ్రాండ్ సక్సెస్ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి ఆయన స్టార్ట్ చేసిన కొత్త సినిమా టాక్సిక్. పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాకు లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వెంకట్ కె.నారాయణ, యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గురువారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘టాక్సిక్’ టీజర్‌ని విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ రికార్డులను కొల్లగొడుతుంది.
READ ALSO: CM Revanth Reddy : క్యూర్-ప్యూర్-రేర్‌తో డెవలప్‌మెంట్ మోడల్
ఈ టీజర్‌లో రాయ పాత్రలో పరిచయమైన యశ్ మామూలు విధ్వంసం సృష్టించలేదు. తాజాగా టాక్సిక్ చిత్ర నిర్మాతలు యూట్యూబ్‌లో టాక్సిక్ టీజర్ సృష్టించిన విధ్వంసం గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ టీజర్ విడుదలైన 24 గంటల్లోనే, 200 మిలియన్ల వీక్షణలను అధిగమించిందని ఈ సందర్భంగా వారు వెల్లడించారు. “టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్” మార్చి 19, 2026న “టాక్సిక్” కన్నడ, ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, ఇతర భాషలలో విడుదల కానుంది. ఈ చిత్రంలో యష్ తో పాటు నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, అక్షయ్ ఒబెరాయ్, టోవినో థామస్, సుదేవ్ నాయర్ నటించారు.
