Site icon NTV Telugu

Toxic Movie టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్.. బెంగళూరులో భారీ ఈవెంట్‌కు యష్ ప్లాన్!

Toxic Movie

Toxic Movie

కన్నడ పవర్‌హౌస్ యష్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ , పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. ఈ సినిమాలో యష్ డబుల్ రోల్‌లో కనిపించబోతున్నారనే వార్త ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది.

Also Read : Virosh : అభిమానులతో కలిసి భోజనం చేసిన ‘విరోష్’.. విజయ్-రష్మికల సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా!

సమాచారం ప్రకారం.. ‘టాక్సిక్’ ట్రైలర్‌ను ఈ నెల మార్చి 8న విడుదల చేసేందుకు మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారట. ఈ సందర్భంగా బెంగళూరులో ఒక భారీ ఈవెంట్‌ను నిర్వహించి, అత్యంత వైభవంగా ట్రైలర్‌ను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. యష్ సరసన నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి మరియు రుక్మిణి వసంత్ వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తుండటంతో ఈ ట్రైలర్ ఎలా ఉండబోతోందా అని సినీ ప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల మార్చి 19న ‘టాక్సిక్’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

Exit mobile version