NTV Telugu Site icon

Yash: యష్ సినిమాలో సాయి పల్లవి.. డైరెక్టర్ ఎవరంటే?

Yash Movie

Yash Movie

కన్నడ స్టార్ హీరో యష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒక్క కేజీఎఫ్ తో ఇండియా మొత్తం క్రేజ్ సొంతం చేసుకున్నాడు రాకింగ్ స్టార్ యశ్. కన్నడ ఇండస్ట్రీలో హీరోగా రాణించిన యశ్.. కేజీఎఫ్ తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కింది.. దాదాపు అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. ఆతర్వాత కేజీఎఫ్ 2 కూడా భారీ విజయం సాధించింది. రెండు భాగాలూ సూపర్ హిట్ అవడంతో యష్ నెక్ట్స్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ 2 తర్వాత యష్ సినిమాలకు చిన్న గ్యాప్ తీసుకున్నాడు.

తాజాగా యశ్ తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. అలాగే వచ్చే శుక్రవారం కొత్త మూవీ టైటిల్ ను అనౌన్స్ చేయనున్నారు.. ఈ సినిమాలో కూడా ఆ సినిమాను మించిన భారీ యాక్షన్ తో తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమాకు గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే ఈ గురించి ఇప్పుడు ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..

యష్ 19 సినిమాలో యష్ కు జోడీగా సాయి పల్లవి నటిస్తుందని టాక్ వినిపిస్తుంది . ఈ మూవీతో కన్నడ ఇండస్ట్రీలో సాయి పల్లవి అడుగుపెట్టనుందని తెలుస్తోంది. సాయి పల్లవి కూడా ఈ గార్గి తర్వాత గ్యాప్ తీసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ మూవీ చేస్తుంది. నాగ చైతన్య హీరోగా నటిస్తున్న నయా మూవీలో నటిస్తుంది. ఈ చిత్రంకు తండేల్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో రానుంది… ఈ మత్యకారుల జీవితం నేపథ్యంలో తెరకెక్కుతోందని తెలుస్తోంది.. ఈ సినిమా నిజంగా సాయి పల్లవి నటిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది..

Show comments