NTV Telugu Site icon

Yarlagadda Venkatrao : గన్నవరంలో అన్ని వర్గాల అభివృద్దికి కృషి

Yarlagadda Venkatrao

Yarlagadda Venkatrao

గన్నవరం నియోజవర్గంలో అన్ని వర్గాల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని గన్నవరం నియోజవర్గ టిడిపి, జనసేన, బిజెపి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు హామీ ఇచ్చారు. గన్నవరం రోటరీ ఆడిటోరియంలో మంగళవారం సాయంత్రం జరిగిన రజక సంఘం ఆత్మీయ సమావేశం పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గన్నవరం నియోజవర్గంలోని రజకుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల్లో రజకచెరువుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. పోలవరం కాలవ పై శాశ్వతంగా మోటార్లు ఏర్పాటు చేసి నియోజకవర్గం లోని మెట్ట గ్రామాలలో తాగునీటి,సాగునీటి ఇబ్బందులు తొలగిస్తానని హామీ ఇచ్చారు.

Delhi Crime: దారుణం.. స్క్రూడ్రైవర్‌తో పొడిచి భార్య, బావమరిదిని హత్య చేసిన భర్త

పోలవరం కాలువ నీటితో గ్రామాల్లోని చెరువుల నింపి సాగునీటి కొరత తీరుస్తామని చెప్పారు. నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తానని రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు యార్లగడ్డ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో…… దువ్వారపు రామారావు గారు. ఎమ్మెల్సీ రజక సాధికార రాష్ట్ర కన్వీనర్ గుర్రపు శాల రామకృష్ణ గారు. కృష్ణాజిల్లా రజక సాధికార చాగంటి కృష్ణ గారు. గన్నవరం మండలం తెలుగు యువత అధ్యక్షుడు చీమలదండు శివరామకృష్ణ గారు. గన్నవరం మండలం మహిళా అధ్యక్షురాలు చిక్కవరపు నాగమణి గారు. తదితర రజక కుల పాల్గొనడం జరిగింది..

Peddireddy Ramachandra Reddy: చంద్రబాబువి వీలుకాని హామీలు.. మళ్లీ మోసం చేసేందుకు సిద్ధమయ్యారు..