Yanamala Ramakrishnudu : అదానీ కంపెనీతో జగన్ ప్రభుత్వ సోలార్ పవర్ కొనుగోళ్ల ఒప్పందాలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ విషయంలో ఈ ఒప్పందం రెండో అతిపెద్ద క్విడ్ ప్రో కో అంటూ యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. జగన్ క్విడ్ ప్రో కో వ్యవహరంలో విచారణ జరిపించాలని ఏపీ ప్రభుత్వాన్ని యనమల కోరారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అదానీతో సోలార్ పవర్ ఒప్పందాల విషయమై సీఎం హోదాలో జగన్ అతి పెద్ద క్విడ్ ప్రో కోకు పాల్పడ్డాడని, జగన్ అవినీతి అక్రమాల చిట్టాలో అదానీతో సోలార్ పవర్ ఒప్పందాలు రెండో పెద్ద క్విడ్ ప్రో కో అని ఆయన ఆరోపించారు. జగన్ క్విడ్ ప్రో కో వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతోందని ఆయన అన్నారు.
Dust Allergy: డస్ట్ అలర్జీతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి..
జగన్ అవినీతి వల్ల ప్రజలపై కరెంట్ ఛార్జీల భారం పడుతుందన్నారు. జగన్ క్విడ్ ప్రో కో విషయంలో సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వమైనా ఏసీబీ విచారణకు ఆదేశించాలని, తమ ప్రభుత్వం హయాంలో సోలార్ విద్యుత్ కొనుగోళ్లపై సెకీతోనే తప్ప.. అదానీతో ఒప్పందాలే చేసుకోలేదని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. సెకీ అనేది కేవలం నోడల్ ఏజెన్సీ మాత్రమే అని, సెకీకి అదానీ కేసుతో ఎంత మాత్రమూ సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అదానీ-జగన్ డీల్ జరిగిందని స్పష్టంగా కన్పిస్తోందని, ఏపీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా జగన్-అదానీ మధ్య ఒప్పందం జరిగిందన్నారు.
OTT: లక్కీ భాస్కర్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే