Site icon NTV Telugu

Yanamala Krishnudu : టీడీపీకి షాక్‌.. యనమల కృష్ణుడు రాజీనామా

Yanamala Krishnudu

Yanamala Krishnudu

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్‌ తగిలింది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు టీడీపీకి రాజీనామా చేశారు. అయితే.. యనమల కృష్ణుడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.. ఈ నెల 27న యనమల కృష్ణుడు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు.. మరోవైపు ఈ రోజు వైసీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి సునీల్ నామినేషన్ కార్యక్రమంలో యనమల కృష్ణుడు పాల్గొంటారని తెలుస్తోంది.. ఇప్పటికే వైసీపీ నేతలతో చర్చలు పూర్తి చేశారు..

యనమల కృష్ణుడు మాట్లాడుతూ.. 42 ఏళ్లుగా టీడీపీ కోసం పనిచేశానని ఆయన అన్నారు. పార్టీ మారడం బాధగా ఉన్న తప్పలేదని ఆయన వెల్లడించారు. జగన్ ఆహ్వానం మేరకు వైసీపీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. తుని లో వైసీపీ జెండా ఎగరడానికి పని చేస్తానని ఆయన ఉద్ఘాటించారు. మోసపూరిత రాజకీయాలను వదలక తప్పలేదని, నన్ను దూరం పెట్టాలని కొందరు దురుద్దేశంతో పని చేశారన్నారు యనమల కృష్ణుడు. నన్ను దూరం పెట్టాలని కొందరు దురుద్దేశంతో పని చేశారన్నారు.

Exit mobile version