Site icon NTV Telugu

70 ఏళ్ల రేసింగ్ వారసత్వానికి నిదర్శనంగా Yamaha R3 70th Anniversary Edition లాంచ్..!

Yamaha R3 70th Anniversary Edition

Yamaha R3 70th Anniversary Edition

Yamaha R3 70th Anniversary Edition: యమహా (Yamaha) ప్రముఖ ఎంట్రీ లెవల్ సూపర్‌స్పోర్ట్ బైక్ YZF-R3కి ప్రత్యేకమైన 70th Anniversary ఎడిషన్ ను గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేసింది. 1955 నుంచి కొనసాగుతున్న యమహా రేసింగ్ వారసత్వాన్ని గుర్తుచేసే ఈ ప్రత్యేక ఎడిషన్ పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండనుంది. 2026 YZF-R3 70th Anniversary ఎడిషన్‌కి వైట్-రెడ్ స్పీడ్ బ్లాక్ థ్రోబ్యాక్ లివరీ, పూర్తిగా బ్లాక్ అండర్‌ బాడీతో ప్రత్యేకమైన డిజైన్ అందించారు. యజీఆర్-M1 మోటోGP బైక్ నుంచి ప్రేరణ పొందిన అగ్రెసివ్ ఫ్రంట్ ఫెయిరింగ్, స్లీక్ సైడ్ ప్యానెల్స్, స్పోర్టీ టెయిల్ వింగ్ డిజైన్‌ దీన్ని మరింత ఆకర్షణీయంగా నిలబెడతాయి. అంతేకాకుండా LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, LED టెయిల్‌లైట్‌, LED టర్న్ సిగ్నల్స్ అందుబాటులో ఉన్నాయి.

Child Abuse Case: చిన్నారిపై ఆయా దారుణం.. స్కూల్ సీజ్, యాజమాన్యంపై కేసు నమోదు.. పాప పరిస్థితి ఎలా ఉందంటే..?

ఈ ప్రత్యేక ఎడిషన్‌లో 321cc హై రివ్వింగ్, ట్విన్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను కొనసాగించారు. ఇది 40.4 bhp పవర్‌ను 10,750 rpm వద్ద, 29.5 Nm టార్క్‌ను 9,000 rpm వద్ద ఉత్పత్తి చేస్తుంది. స్మూత్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు అడ్వాన్స్డ్ అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ సిస్టమ్ డ్రైవింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఇక బైక్ ముందుభాగంలో గోల్డెన్ USD ఫోర్క్‌, వెనుక భాగంలో మోనోషాక్ అందించారు. బ్రేకింగ్ కోసం 298mm ఫ్లోటింగ్ మౌంట్ ఫ్రంట్ డిస్క్, 220mm రియర్ డిస్క్, 17 ఇంచ్ 10 స్పోక్ అల్లాయ్ వీల్స్‌, డ్యూయల్ చానెల్ ABS‌ను యమహా అమర్చింది.

REDMI 15C 5G Lunch: 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా.. 10 వేలకే రెడ్‌మీ నుంచి పవర్ ఫుల్ ఫోన్!

ఈ మోడల్‌లో USB-A ఛార్జింగ్ సాకెట్‌తో పాటు Y-Connect స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ సదుపాయం ఉంది. దీని ద్వారా కాల్స్, ఇమెయిల్స్, మెసేజ్ నోటిఫికేషన్లు, బైక్ స్టేటస్, డిస్టెన్స్, ఇంధన వినియోగం, యాక్సిలరేషన్, లొకేషన్ ట్రాకింగ్ వంటి సమాచారాన్ని మొబైల్ యాప్‌లో చూడవచ్చు. యమహా 2026 R3ను భారతదేశంలో విడుదల చేయలేదు. ప్రస్తుతం 2025 మోడల్ రూ.3.39 లక్షలు (ఎక్స్-షోరూం) ధరకు అమ్ముడవుతోంది. 2026 మోడల్ 2026 మధ్యలో మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా 70th Anniversary Edition పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండనుండడంతో ధర కూడా కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది.

Exit mobile version