150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xiaomi Watch S5, Smart Band 11: షియోమీ (Xiaomi) నుండి కొత్త స్మార్ట్‌వాచ్, స్మార్ట్‌బ్యాండ్‌ను చైనాలో విడుదల చేసింది. Xiaomi 18 Pro, Xiaomi 18 Pro Max స్మార్ట్ఫోన్లతో పాటు Xiaomi Watch S5 41mm, Xiaomi Smart Band 11ను లాంచ్ చేసింది కంపెనీ. ఆరోగ్య పర్యవేక్షణ, ఫిట్నెస్ ట్రాకింగ్‌తో పాటు HyperOS 4 ఆధారంగా పలు స్మార్ట్ ఫీచర్లను వీటిలో అందించారు.
Xiaomi Watch S5
Xiaomi Watch S5 41mm బరువు 36 గ్రాములు కాగా, మందం 9.9 మిమీగా ఉంది. ఇందులో 1.32 అంగుళాల AMOLED డిస్ప్లేను అందించారు. ఇది 60Hz రిఫ్రెష్ రేట్‌తో 3000 నిట్స్ గరిష్ఠ బ్రైట్నెస్ను అందిస్తుంది. సిరామిక్ బెజెల్, స్టెయిన్లెస్ స్టీల్ బాడీ, 24-ఫేసెట్ డైమండ్ కట్ క్రౌన్, ఫ్లోటింగ్ లగ్స్ ఉన్నాయి.
Also Read
- Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ!
- 100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
- 8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
- Vivo S2 FE: 10,000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP68 + IP69 రేటింగ్.. వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్..
వాచ్ వినియోగాన్ని బట్టి 14 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. సాధారణ మానిటరింగ్‌లో 8 రోజుల వరకు, Always -On Display ఆన్‌లో ఉంటే 5 రోజుల వరకు బ్యాటరీ పనిచేస్తుందని షియోమీ తెలిపింది.
ఫిట్నెస్ కోసం 150కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లను అందించారు. డ్యూయల్-ఫ్రీక్వెన్సీ GNSS, ఐదు ప్రధాన శాటిలైట్ సిస్టమ్‌లకు సపోర్ట్ ఉంది. సైక్లింగ్ మోడ్‌లో ఫోన్ డేటా సింక్రనైజేషన్, సైక్లింగ్ రిపోర్ట్స్, థర్డ్‌పార్టీ బ్లూటూత్ పవర్ మీటర్ల సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. నాలుగు-లైట్, నాలుగు-PD సెన్సర్‌తో హార్ట్‌రేట్, బ్లడ్ ఆక్సిజన్‌ను పర్యవేక్షించవచ్చు. నిద్ర, ఒత్తిడి, శ్వాస, HRV వంటి వివరాలను కూడా ట్రాక్ చేస్తుంది. AI ఆధారంగా నిద్రను విశ్లేషించి సూచనలు అందిస్తుంది. మూడు మణికట్టు ఉష్ణోగ్రత సెన్సర్లతో ±0.1°C వరకు ఖచ్చితత్వాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
వాచ్‌లో సైడ్ కీని మూడుసార్లు నొక్కితే ఎమర్జెన్సీ సహాయం పొందే అవకాశం ఉంది. దిగువ బటన్‌ను మూడు సెకన్ల పాటు నొక్కితే 110, 120 లేదా 119కు నేరుగా కాల్ చేసే సదుపాయం ఉంది. ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లతో రియల్‌టైమ్ లొకేషన్ షేరింగ్ కూడా చేయవచ్చు. HyperOS 4 ద్వారా Xiaomi TVలు, స్పీకర్లు, లైట్లు, ఏసీలు, ఎయిర్ ప్యూరిఫైయర్లను వాచ్ నుంచే నియంత్రించవచ్చు. ఫోన్ కెమెరాను రిమోట్‌గా ఆపరేట్ చేయడం, ఫోన్‌ను గుర్తించడం, ఇయర్‌ఫోన్ కంట్రోల్స్, స్మార్ట్ డోర్ లాక్ నోటిఫికేషన్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.
Xiaomi Watch S5కి 47mm Transparent ఎడిషన్ కూడా పరిమిత సంఖ్యలో తీసుకొచ్చారు. ఇందులో Xiaomi Dragon Crystal Glass 3.0, పారదర్శక మిడిల్ ఫ్రేమ్, స్టెయిన్లెస్ స్టీల్ బెజెల్ ఉన్నాయి. ఈ ఎడిషన్ కేవలం 5,000 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. చైనాలో Xiaomi Watch S5 41mm ఫ్లోరోరబ్బర్ స్ట్రాప్ ఎడిషన్ ధర 1,299 యువాన్లు కాగా, లెదర్ స్ట్రాప్ ఎడిషన్ 1,499 యువాన్లు. ఇంకా ట్రాన్స్పరెంట్ ఎడిషన్ ధర 2,499 యువాన్లుగా నిర్ణయించారు. ఈ వాచ్ ప్రస్తుతం చైనాలో ఆర్డర్లకు అందుబాటులో ఉంది.
Xiaomi Smart Band 11
స్మార్ట్ బ్యాండ్ 11 (Smart Band 11)ను కూడా చైనాలో విడుదల చేసింది షియోమీ. గత తరం కంటే 9% సన్నగా రూపొందించిన ఈ బ్యాండ్ కేవలం 15.58 గ్రాముల బరువుతో ఉంటుంది. 1.72 అంగుళాల AMOLED డిస్ప్లే, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఇందులో 1.72 అంగుళాల AMOLED డిస్ప్లే ఉంది. ఇది 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్నెస్ను అందిస్తుంది. 2 మిమీ అల్ట్రా-నారో ఈక్వల్ బెజెల్స్‌తో స్క్రీన్‌ను రూపొందించారు. అల్యూమినియం అల్లాయ్ మిడిల్ ఫ్రేమ్, మ్యాట్ శాండ్‌బ్లాస్ట్ ఫినిష్, క్విక్-రిలీజ్ స్ట్రాప్ ఉన్నాయి. బ్యాండ్‌లో 150కి పైగా వర్కౌట్ మోడ్లు ఉన్నాయి. రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, యోగా, బాక్సింగ్ వంటి కార్యకలాపాలను ట్రాక్ చేయవచ్చు. రన్నింగ్ కోసం 10 రిస్ట్ ఆధారిత కోర్సులు, హార్ట్‌రేట్ జోన్లు, వైబ్రేషన్ రిమైండర్లు ఉన్నాయి.
స్విమ్మింగ్ మోడ్‌లో రియల్‌టైమ్ హార్ట్‌రేట్ మానిటరింగ్, AI స్ట్రోక్ రికగ్నిషన్, 9 యాక్సిస్ పోస్చర్ టర్న్ డిటెక్షన్ ఉన్నాయి. ల్యాప్ రికార్డింగ్ ఖచ్చితత్వం 95% వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. బ్యాండ్ 5ATM వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. డ్యూయల్-ల్యాంప్, డ్యూయల్-PD హార్ట్‌రేట్ సెన్సర్‌తో రోజంతా హార్ట్‌రేట్‌ను పర్యవేక్షించవచ్చు. అసాధారణ హార్ట్‌రేట్ అలర్ట్‌లు, బ్లడ్ ఆక్సిజన్, ఒత్తిడి, శ్వాస, నిద్ర HRV, నిద్ర ట్రెండ్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. AI నిద్ర విశ్లేషణతో విశ్రాంతి, వ్యాయామానికి సంబంధించిన సూచనలు కూడా అందిస్తుంది.
Xiaomi Smart Band 11లో బ్యాటరీ బ్యాకప్ 21 రోజుల వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. అల్ట్రా-లాంగ్ మోడ్‌లో 21 రోజులు, సాధారణ వినియోగంలో 12 రోజులు, Always-On Displayతో 7 రోజుల వరకు బ్యాటరీ లభిస్తుంది. HyperOS 4తో సిస్టమ్ యాప్‌ల కోసం డ్యూయల్-కాలమ్ లేఅవుట్, ఇంటిగ్రేటెడ్ డివైస్ సెంటర్‌ను అందించారు. ఫోన్, Mi హోమ్ డివైజ్‌లు, అనుకూల కార్ ఫంక్షన్లను బ్యాండ్ ద్వారా నియంత్రించవచ్చు. రిమోట్ ఫోటోగ్రఫీ, ఫోన్/ట్యాబ్లెట్ ఫైండర్, ఇయర్‌ఫోన్ సెట్టింగ్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. చైనాలో Xiaomi స్మార్ట్ బ్యాండ్ 11 స్టాండర్డ్ ఎడిషన్ ధర 299 యువాన్లు, NFC ఎడిషన్ ధర 349 యువాన్లు. సిల్వర్, బ్లాక్, పింక్ గోల్డ్, డాన్ గోల్డ్ మిడిల్ ఫ్రేమ్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది. ప్రస్తుతం చైనాలో ఆర్డర్లకు అందుబాటులో ఉంది.
తాజావార్తలు
-
Nissan Pixo: నిస్సాన్ పిక్సో విడుదల.. 259KM రేంజ్, 10-అంగుళాల డిస్ప్లే, Gemini వాయిస్ అసిస్టెంట్.. ఫీచర్లు ఇవే
-
Anakapalli: వర్షాల వేళ విషాదం.. తల్లీకూతుళ్లను బలిగొన్న విద్యుత్ వైరు
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
-
Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
-
Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!