Site icon NTV Telugu

Jinping – Putin – Kim Jong: చావును జయిద్దాం.. జిన్‌పింగ్-పుతిన్-కిమ్ మధ్య ఆసక్తికర ముచ్చట్లు..

Jinping Putin Kim

Jinping Putin Kim

Jinping – Putin – Kim Jong: చైనా విక్టరీ డే పరేడ్‌లో ఓ సంఘటన ప్రపంచాన్ని ఆకర్షించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ – చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌ మధ్య జరిగిన సరదా సంభాషణ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచ్చెత్తింది. ఈ వీడియో బయటికి రావడంతో ప్రపంచంలో ఎవరి ఊహకు అందని హై ప్రొఫైల్ సంభాష ఇదంటూ పలువురు నెటిజన్‌లు కమెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఈ ముగ్గురు దేశాధినేత మధ్య జరిగిన సంభాష ఏంటో ఈ స్టోరీలో తెలుసుందాం..

READ ALSO: Donald Trump: భారత్‌ను లింక్ చేస్తూ, సుంకాలపై సుప్రీంకోర్టుకు ట్రంప్..

ఏం మాట్లాడుకున్నారంటే..
రష్యా అధ్యక్షుడు పుతిన్ – ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ – చైనా అధ్యక్షుడు జి.జిన్‌పింగ్ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడంలో బీజీగా ఉన్నారు. అయితే ఈ ముగ్గురు దేశాధినేతలు మాట్లాడిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. అది విన్న నెటిజన్‌లు మామూలు షాక్‌కు గురి కాలేదు. ఇంతకీ ఆ ఆడియోలో ఏముందో అని ఆలోచిస్తున్నారా, ఏం లేదండి.. ఈ ముగ్గురు చావును జయించాలని ప్లాన్ చేస్తున్నారు. పుతిన్ – జిన్‌పింగ్ టియానన్మెన్ వేదిక వైపు నడిచినప్పుడు, పుతిన్ చైనీస్ భాషలో ఇలా చెప్పడం ఆ ఆడియోలో వినిపించింది.. జీవసాంకేతిక శాస్త్రం అద్భుతంగా పురోగమిస్తోంది. ముసలివైపోతున్న, పాడవుతున్న అంతర్గత అవయవాలను ఎప్పటికప్పుడు మార్పిడి చేసుకుంటూ మనిషి చాన్నాళ్లు జీవించవచ్చు. ఇలా నూతన అవయవాలతో యవ్వన ఛాయతో మెరుగైన జీవనం సాధ్యమే. బయోటెక్నాలజీతో సాధ్యమైతే చివరకు మృత్యువును జయించవచ్చు” అని అన్నారు.

దీనికి జిన్‌పింగ్ స్పందిస్తూ.. ”గతంలో 70 ఏళ్లు బతకడం అంటే గగనం. ఇప్పుడు 70 ఏళ్లు వయస్సు వచ్చినా చిన్నపిల్లాడి కిందే లెక్క. కొందరు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం అభివృద్ధిలోకి వస్తున్న వైద్యశాస్త్ర పరిశోధనా ఫలాలను అందిపుచ్చుకుంటే ఈ శతాబ్దిలోనే మనుషులు 150 ఏళ్లదాకా జీవించగలరు” అని అన్నారు. ఇదే సమయంలో జిన్‌పింగ్, పుతిన్లను చూసి కిమ్ నవ్వుతూ కనిపించాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే.. రష్యా- చైనా దేశాల అధ్యక్షుల వయస్సు 72 కావడం. వీళ్లు ఇప్పటికే తదుపరి ఎన్నికల్లోనూ అధ్యక్ష పీఠంపై కూర్చునేలా ఇరు దేశాల్లో రాజ్యాంగ సవరణ చేశారు.

READ ALSO: Salt Typhoon: అమెరికాను గజగజలాడిస్తున్న ‘సాల్ట్‌టైపూన్’.. చైనా ఇంత పని చేసిందేంటి!

Exit mobile version