NTV Telugu Site icon

WTC 2023-25: ఇంగ్లండ్‌ చేతిలో ఓటమి.. డ‌బ్ల్యూటీసీ ప‌ట్టిక‌లో ఐదో స్థానానికి పడిపోయిన భారత్!

Team India Test

Team India Test

India WTC Points Table Today: తొలి టెస్టు ఓట‌మి బాధ‌లో ఉన్న‌ టీమిండియాకు భారీ షాక్ త‌గిలింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానానికి పడిపోయింది. గ‌త ఐదు టెస్టుల్లో రెండింటిలో మాత్ర‌మే గెలిచిన టీమిండియా.. 43.33 విజ‌యాల శాతంతో బంగ్లాదేశ్ (50) తర్వాతి స్థానంలో నిలిచింది. తొలి టెస్టుకు ముందు భారత్ రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. అంతకుముందు డ‌బ్ల్యూటీసీ ప‌ట్టిక‌లో అగ్రస్థానంలో కూడా నిలిచింది.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో ఇంగ్లండ్ మూడు విజయాలు సాధించింది. ఇప్పటివరకు 6 టెస్టులు ఆడిన ఇంగ్లీష్ జట్టు రెండు విజయాలు, ఓ డ్రాతో 29.16 విజ‌యాల శాతంతో ఎనిమిదవ స్థానంలో ఉంది. స్వ‌దేశంలో పాకిస్థాన్‌ను వైట్‌వాష్ చేసి, వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ స‌మం చేసుకున్న ఆస్ట్రేలియా పట్టికలో టాప్ ర్యాంక్‌లో (55 శాతం) ఉంది. ద‌క్షిణాఫ్రికా (50 శాతం) రెండో స్థానంలో, న్యూజిలాండ్ (50 శాతం) మూడో స్థానంలో, బంగ్లాదేశ్ నాలుగో స్థానంలో ఉన్నాయి.

Also Read: BB 17 Finale: బిగ్‌బాస్‌ 17 విన్నర్‌ కమెడియన్‌ మునావర్‌ ఫారూఖీ.. గట్టి పోటీనిచ్చిన మన్నార చోప్రా!

ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్‌సిప్‌లో టీమిండియాకు తిరుగులేని రికార్డు ఉంది. వరుసగా రెండుసార్లు ఫైనల్ చేరిన ఘనత భారత్ సొంతం. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌ను ఈసారి కూడా భారత్ బాగానే ఆరంభించింది. ద‌క్షిణాఫ్రికాపై చిరస్మ‌ర‌ణీయ విజ‌యం సాధించి డ‌బ్ల్యూటీసీ ప‌ట్టిక‌లో రెండో స్థానంలో నిలిచింది. అయితే సొంత‌గ‌డ్డ‌పై మాత్రం తేలిపోయింది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ ఉప్ప‌ల్ స్టేడియంలో ఇంగ్లండ్ జ‌రిగిన తొలి టెస్టులో అనూహ్యంగా ఓడిపోయింది. పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ ఆడుతాయనే విషయం తెలిసిందే.