WTC Table 2025: డబ్ల్యూటీసీలో అగ్రస్థానానికి ఆస్ట్రేలియా.. భారత్‌కు ఇంగ్లండ్ సిరీస్ కీలకం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WTC 2025 Points Table: టెస్టు మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా అదరగొడుతోంది. ఇటీవల పాకిస్థాన్‌పై మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఆసీస్.. తాజాగా అడిలైడ్ వేదికగా ముగిసిన మొదటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 పట్టికలో ఆసీస్ అగ్రస్థానానికి చేరుకుంది. డబ్ల్యూటీసీ ఎడిషన్ 2023-25లో ఇప్పటివరకు తొమ్మిది టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా.. 6 విజయాలు, 2 ఓటములు, ఒక డ్రాతో చేసుకుంది. మొత్తం 61.11 శాతం విజయాలతో పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది.
Also Read: NZ vs PAK: న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్‌కు కరోనా పాజిటివ్.. ఇది రెండో కేసు!
Also Read
ఆస్ట్రేలియా వరుస విజయాల కారణంగా భారత్ రెండో స్థానానికి పడిపోయింది. ఈ డబ్ల్యూటీసీ ఎడిషన్‌లో నాలుగు మ్యాచుల్లో రెండు విజయాలు, ఒక ఓటమి, ఒక డ్రాతో 54.16 శాతంను భారత్ నమోదు చేసింది. దక్షిణాఫ్రికా (50 శాతం), న్యూజిలాండ్ (50 శాతం), బంగ్లాదేశ్ (50 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోవాలంటే సీజన్ పూర్తయ్యే నాటికి తొలి రెండు స్థానాల్లో నిలవాలి. త్వరలో భారత్‌కు అత్యంత కఠిన సవాల్ ఎదురుకానుంది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను రోహిత్ సేన ఆడనుంది. ఈ సిరీస్‌ను గెలిస్తేనే మళ్లీ అగ్రస్థానానికి చేరుకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం పట్టికలో ఇంగ్లీష్ జట్టు 15 శాతంతో ఏడో స్థానంలో ఉంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!