NTV Telugu Site icon

Wrestlers Protest : మేమే నేరస్తులమయ్యాం.. మా ఫోన్లు ట్రాక్ చేస్తున్నారు

Wrestlers

Wrestlers

Wrestler Protest : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణ నేపథ్యంలో రెజ్లర్ల నిరసన 18వ రోజుకు చేరుకుంది. ధర్నాలో కూర్చున్న వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, సత్యవ్రత్ కడియన్‌లు తాజాగా కీలక విషయాలు వెల్లడించారు. బ్లాక్ డే గా పేర్కొంటూ..నల్ల బ్యాండ్‌లు ధరించారు. కొంతమంది మద్దతుదారులు బ్రిజ్ భూషణ్‌పై చర్య తీసుకోకపోవడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనగా వారి చేతులపై వాటిని ధరించారు. మైనర్‌తో సహా పలువురు మహిళా గ్రాప్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అన్ని ఆరోపణలను తిరస్కరించిన బిజెపి ఎంపిపై ఢిల్లీ పోలీసులు పోక్సో చట్టంలోని సెక్షన్ 10 కింద ఒకటి సహా రెండు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేశారు.

Read Also: Katharine Hepburn: మరపురాని కేథరిన్ హెబ్బర్న్!

తాజాగా బజరంగ్ పునియా మీడియాతో మాట్లాడారు. తమ ఫోన్ నంబర్‌లు ట్రాక్ చేస్తున్నారంటూ ఆరోపించారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు నిరసనగా తాము నేడు బ్లాక్ డేగా పాటిస్తున్నామన్నారు. తమ పోరాటానికి మద్దతుగా ఈ దేశమే నిలుస్తుందనీ, తమ పోరాటంపై తమకు నమ్మకం ఉందని బజరంగ్ పునియా అన్నారు. రోజురోజుకు తమ నిరసన ఉధృతమవుతోందనీ, తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ప్రస్తుతం తమ ఫోన్ నంబర్లను ట్రాక్ చేస్తున్నారని మమ్మలను నేరం చేసినట్లు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా తమ కాంటాక్ట్‌లో ఉన్న వారిని ట్రాక్ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

Read Also:KKR vs RR : కోల్‌కతాపై రాజస్తాన్‌ ఘన విజయం.. దుమ్మలేపిన జైస్వాల్‌

ఇటీవల ప్రపంచ ఛాంపియన్‌షిప్, ఒలింపిక్ పతక విజేత అథ్లెట్ సీమా యాంటిల్‌ మాట్లాడుతూ..రెజర్ల నిరసన శిబిరాల వల్ల తమ ప్రాక్టీస్ సజావుగా సాగడం లేదన్నారు. దీంతో తమ ప్రదర్శనపై ప్రతికూల ప్రభావం చూపిందన్నారు. సీమా యాంటిల్‌ వ్యాఖ్యలను పునియా తప్పు బట్టారు. బ్రిజ్ భూషణ్ కంటే మనం ఆటకు నష్టం కలిగిస్తున్నామని ఆమె చెబుతున్నట్లు నాకు అర్థం కావడం లేదు. క్రీడాకారిణి అయినప్పటికీ ఆమె ఈ విషయాన్ని అర్థం చేసుకోకపోవడం చాలా విచిత్రంగా ఉందన్నారు. ఈ క్రమంలోనే భారత్ కిషన్ యూనియన్ ఏక్తా (ఆజాద్) ప్రతినిధి బృందం, పంజాబ్‌కు చెందిన మహిళలతో గురువారం జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న రెజ్లర్లను మద్దతుగా నిలిచి.. వారి సంఘీభావాన్ని తెలిపారు.