WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
- కేరళలోని కొచ్చి వేదికగా..
- అక్టోబర్ 28న డబ్ల్యూపీఎల్ 2027 వేలం
- 27 ఖాళీ స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు పోటీ
- వేలం జాబితాలో 119 మంది భారతీయ ప్లేయర్లు
- భారతీయుల్లో 22 మంది క్యాప్డ్, 97 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WPL 2027 Auction: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2027 సీజన్‌కు సంబంధించిన ఆటగాళ్ల వేలానికి రంగం సిద్ధమైంది. అక్టోబర్ 28న సాయంత్రం 5:30 గంటలకు కేరళలోని కొచ్చిలో ఈ వేలం జరగనున్నట్లు ఆఫీసియల్గా పేర్కొన్నారు. ఈ వేలంలో ఫ్రాంచైజీల వద్ద ఖాళీగా ఉన్న 27 స్థానాలకు మొత్తం 146 మంది ప్లేయర్లు బరిలో ఉన్నారు. ఈ జాబితాలో 119 మంది భారతీయ ప్లేయర్లు ఉన్నారు. వీరిలో 22 మంది క్యాప్డ్, 97 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు. భారతీయుల కోసం మొత్తం 20 స్థానాలు అందుబాటులో ఉన్నాయి.
మరోవైపు 27 మంది విదేశీ ప్లేయర్లు వేలంలో పాల్గొంటున్నారు. వీరిలో 14 మంది క్యాప్డ్, 13 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు కాగా.. ఏడు విదేశీ ప్లేయర్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. విదేశీ జాబితాలో అసోసియేట్ దేశాలకు చెందిన ఆరుగురు ప్లేయర్లు కూడా ఉన్నారు. వేలంలో పలువురు స్టార్ ప్లేయర్లు తమ బేస్ ప్రైస్‌ను రూ.50 లక్షలుగా నిర్ణయించుకున్నారు. సోఫియా డంక్లీ, సోఫీ మోలినెక్స్ అత్యధిక బేస్ ప్రైస్‌తో జాబితాలో ఉన్నారు. ఇక కమలిని, కిరణ్ నవ్‌గిరే, హీథర్ గ్రాహమ్, జెస్ జొనాసెన్ రూ.40 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి రానున్నారు. మరో 30 మంది ప్లేయర్లు రూ.30 లక్షల బేస్ ప్రైస్‌ను ఎంచుకున్నారు.
Also Read
- Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!
- Chinmay Sutar: 77 ఏళ్ల తర్వాత రంజీలో క్వాడ్రుపుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన చిన్మయ్.!
- BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!
- WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?
WPL 2027 వేలం ఈ సైకిల్లో తొలి మినీ యాక్షన్ కానుంది. గతేడాది న్యూఢిల్లీలో జరిగిన మెగా వేలం తర్వాత ఫ్రాంచైజీలు తమ జట్లను పూర్తిగా పునర్వ్యవస్థీకరించుకున్నాయి. సెప్టెంబర్‌లోనే ఆయా జట్లు తమ రిటెన్షన్స్, రిలీజ్‌లను ఖరారు చేసుకుని మినీ వేలానికి సిద్ధమయ్యాయి. ఇప్పటివరకు ముంబైలో రెండు, బెంగళూరులో ఒకటి, న్యూఢిల్లీలో ఒకటి చొప్పున WPL వేలాలు జరిగాయి. ఇప్పుడు 2027 వేలం కొచ్చి వేదికగా జరగనుంది.
🚨 News 🚨
#TATAWPLAuction 2027 Player List announced!
The player auction will see 146 players competing for 27 available slots 📝
📍 Kochi
⏰ October 28, 5.30 PM IST🔽 More details | #TATAWPL
https://t.co/GKfyOO1Kar
— Women’s Premier League (WPL) (@wplt20) October 19, 2026
తాజావార్తలు
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!
-
Honey Trap: హైదరాబాద్‌లో హనీ ట్రాప్ కలకలం.. నకిలీ ఖాతాలతో వేల మందికి టోకరా
-
Italy Protests: ఇటలీలో జెన్-ఆల్ఫా విధ్వంసం.. రూ. 4,400 కోట్లు బూడిద!
-
Prabhas Birthday Special : డార్లింగ్ ఫ్యాన్స్‌కు బర్త్‌డే ట్రీట్ ఇదొక్కటేనా?
ట్రెండింగ్
-
BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!
-
WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?
-
Vaibhav Sooryavanshi: ఆ ముగ్గురిలో ఒకరు తప్పుకుంటూనే వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు.!
-
108MP+50MP సెల్ఫీ కెమెరా, 6000mAh బ్యాటరీతో రాబోతున్న HMD Vibe 2 Max..!
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!