All you need to know WPL 2024: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024కు రంగం సిద్ధమైంది. శుక్రవారం రెండో సీజన్‌కు తెరలేవనుంది. చెన్నైలోని చిన్నస్వామి స్టేడియంలో గతేడాది ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్, రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్‌తో డబ్ల్యూపీఎల్ 2024కు తెరలేవనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఓపెనింగ్ సెర్మనీ సాయత్రం 6.30 గంటలకు జరగనుంది. రాత్రి 7:30 నుంచి స్పోర్ట్–18, జియో సినిమాలో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. గత ఏడాదిలాగే ఈసారి కూడా మొత్తం 22 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. మార్చి 17న ఢిల్లీ వేదికగా డబ్ల్యూపీఎల్ ఫైనల్ జరుగుతుంది.
డబ్ల్యూపీఎల్ ఆరంభ సీజన్ కేవలం ముంబైలోని డీవై పాటిల్, బ్రబౌర్న్ స్టేడియాల్లోనే జరిగింది. డబ్ల్యూపీఎల్‌కు ఆదరణ పెరగడంతో ఈసారి రెండు నగరాల్లో మ్యాచ్‌లు జరగబోతున్నాయి. తొలి 11 మ్యాచ్‌లకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం, ఫైనల్ సహా చివరి 11 మ్యాచ్‌లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిథ్యమిస్తాయి. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియల్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు టైటిల్ కోసం బరిలోకి దిగుతున్నాయి.
పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ‘ఎలిమినేటర్’ మ్యాచ్‌లో తలపడతాయి. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. ఇక చిన్నస్వామి స్టేడియంలో జరిగే డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ఆరంభ వేడుకల్లో బాలీవుడ్ హీరోలు షారుక్ ఖాన్, షాహిద్ కపూర్, టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్ర, కార్తీక్ ఆర్యన్ సహా మరికొందరు ప్రత్యేక ప్రదర్శన ఇవ్వబోతున్నారు.
Also Read: MLA Lasya Nanditha: ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి కారణం అదే!
హైదరాబాద్, ఏపీ నుంచి 8 మంది డబ్ల్యూపీఎల్ 2024లో బరిలోకి దిగనున్నారు. హైదరాబాద్ ప్లేయర్లు అరుంధతి రెడ్డి (ఢిల్లీ), త్రిష పూజిత (గుజరాత్), యషశ్రీ, గౌహర్ సుల్తానా (యూపీ) జట్లకు ఆడుతున్నారు. ఏపీ ప్లేయర్లు స్నేహ దీప్తి (ఢిల్లీ), సబ్బినేని మేఘన (బెంగళూరు), ఎండీ షబ్నమ్ (గుజరాత్), అంజలి శర్వాణి (యూపీ) టీమ్‌ల తరఫున ఆడుతున్నారు. హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, షెఫాలీ వర్మ, శిఖా పాండే, రేణుక సింగ్ లాంటి స్టార్స్ కూడా పలు జట్లకు ఆడుతున్నారు.