WPL 2024 Schedule: ఫిబ్రవరి 23న డబ్ల్యూపీఎల్ ఆరంభం.. మార్చి 17న ఫైనల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WPL 2024 Schedule Announced: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ఫిబ్రవరి 23న బెంగళూరులో ప్రారంభం కానుంది. గత ఏడాది ఫైనలిస్టులు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య చిన్నస్వామి స్టేడియంలో టోర్నీ మొదటి మ్యాచ్ జరుగుతుంది. బీసీసీఐ షెడ్యూల్ ప్రకారం.. రెండో మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వారియర్స్ జట్ల మధ్య ఫిబ్రవరి 24న జరుగునుంది. మార్చి 15న ఎలిమినేటర్ మ్యాచ్, మార్చి 17న ఫైనల్ మ్యాచ్ ఢిల్లీలో జరగనున్నాయి.
తొలి సీజన్‌లో ముంబైకే పరిమితమైన డబ్ల్యూపీఎల్.. రెండో సీజన్‌లో మాత్రం రెండు నగరాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. డబ్ల్యూపీఎల్ 2024లో ఐదు జట్లు బెంగళూరు, ఢిల్లీ వేదికగా 22 మ్యాచ్‌లు ఆడనున్నాయి. బెంగళూరు లెగ్ మార్చి 4 వరకు కొనసాగుతుంది. తర్వాత ఢిల్లీకి టోర్నీ తరలిపోతుంది. రెండవ సీజన్‌లో మ్యాచ్‌లు 24 రోజులు జరగనుండగా.. డబుల్ హెడర్‌లు మాత్రం లేవు. అన్ని మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
Also Read: T20 World Cup 2024: టీమిండియాకు వ్యతిరేకంగా ఆడటమే నా లక్ష్యం.. భారత ప్లేయర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సక్సెస్ కావడంతో.. మహిళలకు డబ్ల్యూపీఎల్ లీగ్ గతేడాది బీసీసీఐ నిర్వహించింది. డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ క్రీడాభిమానులను అలరించింది. ముంబై వేదికగా జరిగిన ఈ టోర్నీలో.. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు టైటిలో కోసం పోటీ పడ్డాయి. ఫైనల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై చాంపియిన్‌గా నిలిచింది. మొదటి సీజన్ పూర్తిగా ముంబైలో జరిగింది. రెండో సీజన్‌ను హోమ్ మరియు హోమ్ అవే మోడల్‌లో బీసీసీఐ ప్లాన్ చేసింది. అయితే బీసీసీఐ ప్రణాళికను అమలు చేయడానికి లాజిస్టికల్ సవాళ్లను ఎదుర్కొవాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!