Ellyse Perry Best Bowling Figures in WPL: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ప్లేయర్ ఎలీస్ పెర్రీ చరిత్ర సృష్టించారు. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు నమోదు చేశారు. డబ్ల్యూపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పెర్రీ.. తన కోటా 4 ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టారు. డబ్ల్యూపీఎల్‌లో ఇప్పటివరకు ఆరు వికెట్స్ ఏ బౌలర్ పడగొట్టలేదు.
ఇప్పటివరకు డబ్ల్యూపీఎల్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణంకాల రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ మరిజన్నె కాప్ పేరిట ఉండేది. కాప్ 15 పరుగులు ఇచ్చి 5 వికెట్స్ పడగొట్టారు. మంగళవారం రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌తో కాప్ రికార్డును ఎలీస్ పెర్రీ బ్రేక్ చేసింది. పెర్రీ సాదించిన 6 వికెట్లు కూడా బౌల్డ్‌లు, ఎల్బీ రూపంలో వచ్చినివే. శోభన ఆశ, తారా గాబ్రియెల్లా నోరిస్, కిమ్ గార్త్ కూడా 5 వికెట్స్ పడగొట్టారు.
Also Read: Mahesh Babu: ‘ప్రేమలు’ సినిమా బాగా ఎంజాయ్ చేశా.. ఇంతలా ఎప్పుడు నవ్వుకున్నానో గుర్తులేదు: మహేశ్ బాబు
ఈ మ్యాచ్‌లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో ముంబైపై విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 114 పరుగుల లక్ష్యాన్ని ఆర్‌సీబీ 15 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి మాత్రమే కాదు 115 పరుగులు చేసింది. ఎలీస్ పెర్రీ (40 నాటౌట్), రీచా ఘోష్ (36 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అంతకుముందు ఎలీస్ పెర్రీ (6/15) ధాటికి ముంబై 19 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్ అయింది. సంజీవన్ సంజన (30), మాథ్యూస్ (26) రాణించారు. ఈ విజయంతో లీగ్‌లో తొలిసారి ప్లేఆఫ్ బెర్తును ఆర్‌సీబీ దక్కించుకుంది.