How Much Prize Money RCB Won in WPL 2024: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది. డబ్ల్యూపీఎల్ ఫైనల్ చేరిన తొలిసారే ఆర్‌సీబీ టైటిల్‌ను దక్కించుకుంది. దాంతో ఆర్‌సీబీ ఫ్రాంఛైజీ కల ఎట్టకేలకు నేరవేరింది. గత 16 ఏళ్లగా ఐపీఎల్‌లో పురుషుల జట్టుకు అందని ద్రాక్షగా ఉన్న టైటిల్ కలను డబ్ల్యూపీఎల్‌లో అమ్మాయిలు నెరవేర్చారు. తొలి టైటిల్ అందడంతో ఆర్‌సీబీ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
డబ్ల్యూపీఎల్ 2024 ఛాంపియన్స్‌గా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు రూ.6 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది. రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు రూ.3 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. ఇక ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆర్‌సీబీ స్టార్ ఆల్‌రౌండర్ ఎల్లీస్ పెర్రీ ‘ఆరెంజ్ క్యాప్’ (9 మ్యాచ్‌లలో 347 పరుగులు ) అందుకున్నారు. ఆమెకు రూ.5 లక్షల ప్రైజ్‌మనీ లభించింది. ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన ఆర్‌సీబీ స్పిన్నర్ శ్రేయంక పాటిల్ ‘పర్పుల్ క్యాప్’ (9 మ్యాచ్‌లలో 13 వికెట్లు) హోల్డర్‌గా నిలిచింది. ఆమెకు రూ.5 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది.
Also Read: Gold Price Today: తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే?
డబ్ల్యూపీఎల్ 2024 అవార్డులు లిస్ట్:
ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ – దీప్తి శర్మ (యూపీ)
ఆరెంజ్ క్యాప్ – ఎల్లీస్ పెర్రీ (బెంగళూరు)
పర్పుల్ క్యాప్ – శ్రేయాంక పాటిల్ (బెంగళూరు)
ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ – శ్రేయాంక పాటిల్ (బెంగళూరు)
మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ – దీప్తి శర్మ (యూపీ)
బెస్ట్ క్యాచ్ ఆఫ్ ద టోర్నీ – సజన సజీవన్ (ముంబై)
ఫెయిర్ ప్లే టీమ్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు