Ellyse Perry receives framed broken window gift: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ చెలరేగిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో పెర్రీ బ్యాట్ (66; 50 బంతుల్లో 8×4, 1×6), బంతి (4-29-1)తో రాణించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బెంగళూరును ఫైనల్స్‌కు చేర్చిన పెర్రీపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. ఆర్‌సీబీ తొలిసారి డబ్ల్యూపీఎల్ ఫైనల్‌కు వెళ్లడంలో కీలక పాత్ర పోషించిన పెర్రీకి ఊహించని బహుమతి అందింది.
లీగ్ దశలో యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ బ్యాటర్ ఎలీస్ పెర్రీ ఓ భారీ సిక్స్ కొట్టగా.. బౌండరీ లైన్ ఆవల ప్రదర్శనకు ఉంచిన ‘టాటా పంచ్’ ఈవీ కారు అద్దం పగిలింది. ఆ సిక్సర్‌కు గుర్తుగా పెర్రీకి టాటా కంపెనీ ఊహించని బహుమతిని ఇచ్చింది. పగిలిన కారు అద్దాన్ని ప్రేమ్ కట్టించి పెర్రీకి బహూకరించింది. దాంతో పెర్రీ ఆనందం వ్యక్తం చేసింది. ఇందుకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవున్నాయి.
Also Read: Bhoomi Shetty: ఇన్‌స్టాలో ఫొటోలు షేర్ చేస్తే.. నల్లగా ఉన్నానని కామెంట్స్ చేస్తున్నారు: హీరోయిన్
నేడు డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ స్పోర్ట్స్–18లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. సొంత మైదానంలో అత్యుత్తమ ప్రదర్శనతో టైటిల్ విజేతగా నిలవాలని ఢిల్లీ భావిస్తుండగా.. ఈ సారి ఎలాగైనా కప్ గెలవాలనే పట్టుదలతో బెంగళూరు ఉంది. మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశాలు ఉన్నాయి.
TATA has gifted the Broken Glass window to Ellyse Perry. 😄👌 pic.twitter.com/yPItU3IRc1
— Johns. (@CricCrazyJohns) March 16, 2024
