NTV Telugu Site icon

WPL 2023 : శివాలెత్తిన సీవర్.. వాంగ్ హోరు.. ముంబై చేతిలో చిత్తుగా ఓడిన యూపీ

Mi Vs Up

Mi Vs Up

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఫైనల్ చేరాలంటే తప్పకుండా ఆడాల్సిన మ్యాచ్ లో ముంబై బ్యాటర్లు జూలు విదిల్చారు. గత మూడు మ్యాచ్ లలో విఫలమైన బ్యాటర్లంతా నిన్న( శుక్రవారం ) జరిగిన మ్యాచ్ లో ధాటిగా ఆడారు. ఓపెనర్లు యాస్తికా భాటియా, హేలీ మాథ్యూస్ లు శుభారంభం అందించగా.. వన్ డౌన్ లో వచ్చిన నటాలీ సీవర్(38 బంతుల్లో 72 నాటౌట్, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), మిడిలార్డర్ బ్యాటర్ అమెలియా కెర్ (19 బంతుల్లో 25, 5 ఫోర్లు )లు చిత్తకొట్టారు. వీరి దూకుడుతో నిర్ణత 20 ఓవర్లలో ముంబై.. 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.

Also Read : Missile Misfire: ఆర్మీ మిస్సైల్ మిస్ ఫైర్.. విచారణకు ఆదేశం..

ముంబై నిర్థేశించిన 183 పరుగుల లక్ష్య ఛేధనలో యూపీ వారియర్స్ 17.4 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్ ఇస్సీ వాంగ్ హ్యాట్రిక్ తో యూపీ పనిపట్టింది. ఈ లీగ్ లో ఇదే తొలి హ్యాట్రిక్. ఢిల్లీ-ముంబై మధ్య ఫైనల్ మ్యాచ్ ఆదివారం( మార్ 26 )బ్రబోర్న్ స్టేడియం వేదికగా జరుగుతుంది. అయితే భారీ లక్ష్య ఛేదనలో ముంబై బౌలర్ల ధాటికి యూపీ ఆది నుంచీ ఇబ్బందులు ఎదుర్కొంది. సైకా ఇషాక్ వేసిన రెండు ఓవర్లో ఓపెనర్ శ్వేతా సెహ్రావత్(1) ఎక్స్ ట్రా కవర్స్ లో ఉన్న మాథ్యూస్ చేతికి దొరికింది. మూడో ఓవర్ వేసిన వాంగ్.. యూపీ సారథి హేలీ(11) ని ఔట్ చేసింది.

Also Read : Rahul Gandhi: గాంధీ సిద్ధాంతాలకు ద్రోహం.. రాహుల్ గాంధీ శిక్షపై ఇండో-అమెరికన్ పొలిటీషియన్..

వాంగ్ వేసిన ఐదో ఓవర్ లో తొలి బంతికి కిరణ్ నవ్ గిరె( 27 బంతుల్లో 43, 4 ఫోర్లు, 3సిక్సులు ) ఆఫ్ సైడ్ డ్రైవ్ చేయగా క్విక్ సింగిల్ కోసం యత్నించిన తహిలా మెక్ గ్రాత్ ( 7) పరుగు తీసే ప్రయత్నంలో రనౌట్ అయింది. వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోవడంతో నవ్ రిగె యూపీని ఆదుకునే ప్రయత్నం చేసింద. ఇషాక్ వేసిన ఆరో ఓవర్లో 4,4,4,6తో మొత్తం 20 పరుగులు రాబట్టింది. అమెలియా కెర్ వేసిన ఏడో ఓవర్ లో రెండో బంతిని భారీ షాట్ ఆడిన ఆమె మాథ్యూస్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయింది. మరోవైపు మెక్ గ్రాత్ నిష్క్రమణ తర్వాత వచ్చిన గ్రేస్ హ్యారీస్ (12) మూడు ఫోర్లు కొట్టి ఊఫు మీద కనిపించినా సీవర్.. యూపీకి భారీ షాకిచ్చింద. సీవర్ వేసిన 8వ ఓవర్ లో ఐదో బంతికి భారీ షాట్ ఆడిన హ్యారీస్ లాంగాన్ వద్ద ఉన్న వాంగ్ చేతికి చిక్కింది. పది ఓవర్లకు యూపీ నాలుగు వికెట్లు నష్టానికి 63 పరుగులు చేసింది.

Also Read : Viral : గాలిలో తేలియాడుతున్న రాయి.. మేధావులకి అంతుచిక్కని వైనం

అమెలియా కెర్ వేసిన 12వ ఓవర్ లో నవ్ గిరె రెండు భారీ సిక్సర్లు బాదింది. కానీ ఆ తర్వాత ఓవర్ వేసిన వాంగ్ రెండో బంతికి నవ్ గిరెను ఔట్ చేసింది. తర్వాతి బంతికి సిమ్రాన్ షేక్ బౌల్డ్ అయింది. నాలుగో బంతికి సోఫీ ఎకిల్ స్టోన్ కూడా క్లిన్ బౌల్డ్ అయింద. దీంతో వాంగ్ ఆనందానికి అంతే లేకుండా పోయింది. WPLలో ఇదే తొలి హ్యాట్రిక్ కావడం గమనార్హం. ఈ ఓవర్ కు ముందు 84-4 ఉన్న యూపీ ఆరు బంతుల తర్వాత 86-7 గా మారింది.
14 ఓవర్ వేసిన మాథ్యూస్ బౌలింగ్ లో రెండు బౌండరీలు కొట్టిన దీప్తి శర్మ (160 కూడా షార్ట్ లెగ్ వద్ద జింతమణి కలిత సూపర్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరింది. కలిత వేసిన 17వ ఓవర్ లో తొలి బంతికి అంజలి శర్వణి (5) క్లీన్ బౌల్డ్ అయింది. సైకా ఇషాక్.. 18 ఓవర్ లో గైక్వాడ్ ను ఎల్బీగా వెనక్కి పంపి యూపీ ఇన్సింగ్స్ కు తెరదించింది. ముంబై బౌలర్లలో వాంగ్ నాలుగు ఓవర్లు వేసి 15 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసింది. సైకా ఇషాక్ కు రెండు, సీవర్, కలిత, మాథ్యూస్ లు తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.

Show comments