Site icon NTV Telugu

Nuclear Bomb: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణు బాంబు ఇదే.. ఏ దేశం వద్ద ఉందో తెలుసా..?

Worlds Most Powerful Nuclear Bomb B83

Worlds Most Powerful Nuclear Bomb B83

Worlds Most Powerful Nuclear Bomb: 1945లో హిరోషిమాపై వేసిన అణు బాంబు కేవలం 15 కిలోటన్నుల TNTకి సమానం. అంటే 15,000 టన్నుల గన్‌పౌడర్‌కి సమానం. ఇది 70,000 మందికి పైగా ప్రాణాలను బలిగొంది. ప్రస్తుతం మనం ఓ ఆసక్తికర విషయం గురించి తెలుసుకుందాం.. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణు బాంబు ఎవరి వద్ద ఉంది? యునైటెడ్ స్టేట్స్ వద్ద నిజంగా భారీ అణు బాంబు ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాన్ని తెలుసుకుందాం..

READ MORE: UP: యూపీలో ఘోర ప్రమాదం.. పట్టాలు దాటుతుండగా ప్రయాణికుల్ని ఢీకొట్టిన రైలు.. నలుగురు మృతి

నవంబర్ 2025 వరకు ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న (ఉపయోగానికి సిద్ధంగా ఉన్న) అత్యంత శక్తివంతమైన అణు బాంబు B83 గ్రావిటీ బాంబు. దీన్నిపై నుంచి జారవిడిచే థర్మోన్యూక్లియర్ బాంబు. ఇది 1.2 మెగాటన్నుల TNT, 1,200,000 టన్నుల గన్‌పౌడర్‌కు సమానం. హిరోషిమా బాంబు కంటే 80 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. B83ని ఒక ప్రధాన నగరంపై వేస్తే, 10-15 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న అన్ని బూడిదగా మారిపోతాయి. దీని పేలుడు ఉష్ణోగ్రత 100,000 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటుంది. ఇది సూర్యుని ఉపరితలం కంటే వేడిగా ఉంటుంది. దీనివల్ల మంటలు మైళ్ల వరకు వ్యాపిస్తాయి. ఈ రేడియేషన్ వల్ల లక్షలాది మంది క్యాన్సర్, ఇతర వ్యాధుల బారిన పడి చనిపోతారు. ఈ బాంబు చాలా భారీ పేలుడును సృష్టిస్తుంది. ఒకే ఒక్క పేలుడు 500,000-100,000 మందిని క్షణాల్లో చంపగలదు. అనంతరం వచ్చే దుమ్ము, పొగ ఆకాశంలోకి నిండిపోతుంది. సూర్యరశ్మిని అడ్డుకుంటుంది. ప్రపంచంలోని తొమ్మిది దేశాలు అణు బాంబులను కలిగి ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ , రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, భారతదేశం, పాకిస్థాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియాలో దేశాలు ఈ ప్రమాదకర బాంబులను కలిగి ఉన్నాయి. రష్యాలో అత్యధిక బాంబులు ఉన్నాయి (సుమారు 6,000). కానీ B83 గ్రావిటీ వంటి శక్తివంతమైన బాంబులు మాత్రం యునైటెడ్ స్టేట్స్ వద్ద అత్యధికంగా ఉన్నాయి..

READ MORE: Poker Game In Excise PS: చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసులు.. చెన్నూరు ఎక్సైజ్ స్టేషన్‌లో పేకాట..

Exit mobile version