Site icon NTV Telugu

Most Expensive Cheese: పనికిమాలిన గాడిద కాదు.. లక్షలు కురిపించే గాడిద! కేజీ జున్ను ధర వింటే షాక్ అవుతారు..

Most Expensive Cheese

Most Expensive Cheese

Most Expensive Cheese: పనికిమాలిన గాడిద.. బహుశా ఈ పదం వినని వాళ్లు చాలా అరుదుగా ఉంటారు కావచ్చు. ఏదో ఒక సందర్భంలో, తల్లిదండ్రులు, లేదంటే గురువులు, స్నేహితులు ఎవరో ఒకరు మనల్ని అనే సాధారణ పదం పనికిమాలిన గాడిద. కానీ ఇప్పటి నుంచి ఈ పదం మాత్రం అస్సలు వాడకండే.. ఎందుకంటే గాడిద పాలు చాలా చాలా ఖరీదైనవిగా మారాయి. పనికిమాలిన గాడిద అంటే ఖరీదైన పాలిచ్చే గాడిద ఫీల్ అవుతుంది. గాడిద పాలతో తయారయ్యే జున్ను ధర కేజీ అక్షరాలా రూ.55 వేల పైనే పలుకుతుందంట. ఇంతకీ ఆ జున్ను స్పెషల్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, 7000mAh బ్యాటరీ, 144Hz డిస్‌ప్లేతో బడ్జెట్ సెగ్మెంట్‌లో రానున్న Realme C83 5G.!

ఈ జున్ను ఆవు పాలు లేదా గేదె పాలతో కాకుండా, చాలా అరుదైన బాల్కన్ జాతి గాడిదల పాలతో తయారు చేస్తారు. ఈ గాడిదలు ప్రపంచం మొత్తంలో కేవలం సెర్బియాలోని ‘జసవికా’ అనే ప్రాంతంలో మాత్రమే కనిపిస్తాయి. ఒక కిలో జున్ను తయారు చేయడానికి దాదాపు 25 లీటర్ల గాడిద పాలు అవసరమవుతాయి. నిజానికి గాడిదలు చాలా తక్కువ పాలను ఇస్తాయి, అందుకే దీని ధర ఒక పౌండ్‌కు (సుమారు అరకేజీ) 600 డాలర్లు, అంటే మన దేశీ కరెన్సీలో సుమారు రూ.55,000 వరకు ఉంటుంది. అలాగే ఈ జున్ను తయారు చేయడం కూడా ఒక కళ అని చెబుతున్నారు. దీన్ని తయారు చేయడానికి నెలల సమయం పడుతుందంట. ఇందులో కేవలం గాడిద పాలే కాకుండా, రుచి కోసం కొంత శాతం ఆవు పాలు లేదా మేక పాలను కూడా కలిపి తయారు చేస్తారని అంటున్నారు. గాడిద పాలలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి, ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పూర్వ కాలంలో ఈ పాలను చర్మ సౌందర్యం కోసం కూడా వాడేవారని ప్రతీతి. ఇది ఇతర జున్నుల కంటే భిన్నమైన రుచిని, సువాసనను కలిగి ఉంటుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహార ప్రియులు దీనిని ఒక్కసారైనా రుచి చూడాలని ఆశపడుతుంటారు. మీకు జున్ను అంటే ప్రాణమైతే, మీ బడ్జెట్ అనుమతిస్తే.. ప్రపంచంలోనే అరుదైన ఈ ‘పులే చీజ్’ను ఒకసారి ట్రై చేయండి.

READ ALSO: Hemant Soren: సీఎం సార్ సేఫ్.. జార్ఖండ్ ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టులో ఊరట!

Exit mobile version