ప్రపంచంలోని చాలా మంది ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లను ఇష్టపడతారు. ఐఫోన్ 17 ప్రో మాక్స్, శామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డ్ లాంటి అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేస్తారు. అయితే ప్రపంచంలోనే ఈ రెండింటికంటే అత్యంత ఖరీదైన ఫోన్ కూడా ఉందని మీకు తెలుసా?. ఆ ఫోన్‌కు పెట్టే ధరతో ఏకంగా మూడు ప్రైవేట్ జెట్‌లను కూడా కొనొచ్చు. అత్యంత ఖరీదైన ఫోన్ ఏంటి, ఆ ఫోన్ ఫీచర్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌గా చెప్పబడుతున్న మొబైల్.. పింక్ డైమండ్స్, బంగారం సహా మరిన్ని విలువైన లోహాలతో రూపొందించబడింది. అదే ఫాల్కన్ సూపర్నోవా ఐఫోన్ 6 పింక్ డైమండ్ ఎడిషన్. ఈ వేరియంట్ ధర 48.5 యూఎస్ మిలియన్లు (భారత కరెన్సీలో సుమారు రూ.430 కోట్లు). వెర్టు పోర్టల్ దీనిని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫోన్‌గా అభివర్ణించింది. ఇది ఐఫోన్ 6 యొక్క రీ వెర్షన్ మోడల్. ఈ ఫోన్ ధరతో ఏకంగా 3 ప్రైవేట్ జెట్ విమానాలను కొనుగోలు చేయవచ్చు. ఒక ప్రైవేట్ జెట్ ధర సాధారణంగా రూ.100 కోట్ల నుంచి రూ.140 కోట్ల మధ్య ఉంటుంది. మూడు ప్రైవేట్ జెట్ విమానాలను కొనుగోలు చేసిన ధరకు సమానం.
Also Read: Flipkart Offers 2025: భలే చౌక బేరం.. 10 వేలకే ‘వర్ల్‌పూల్’ 3 డోర్ రిఫ్రిజిరేటర్!
వెర్టు పోర్టల్ ప్రకారం… ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫోన్ తయారీలో 24 క్యారెట్ల బంగారం, పింక్ డైమండ్స్ లను ఉపయోగించారు. ఫాల్కన్ సూపర్నోవా ఐఫోన్ 6 పింక్ డైమండ్ ఎడిషన్‌ను రూపొందించడానికి 10 వారాలు పట్టింది. వజ్రాలు, బంగారాన్ని చేతితో ఒక్కొక్కటిగా ఫోన్‌కు డిజైన్ చేశారు. ఈ ఫోన్ డిస్‌ప్లే, హార్డ్‌వేర్ మాత్రం మారలేదు. ఈఫోన్ 4.7 అంగుళాల రెటినా హెచ్‌డీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది యాపిల్ A8 చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది. 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. సింగిల్ రియర్ 8-మెగాపిక్సెల్ కెమెరా, 1.2-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఈ ఫోన్ కలిగి ఉంది. బంగారం, పింక్ డైమండ్స్ కారణంగా ఈ ఫోన్ ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌గా మారింది.
