NTV Telugu Site icon

Cable railway bridge : దేశంలోనే మొట్టమొదటి తీగల రైల్వే వంతెన ప్రారంభానికి సిద్ధం

Cable Bridge

Cable Bridge

Cable railway bridge : మన దేశ నిర్మాణ రంగంలో మరో అద్భుతం వచ్చి చేరనుంది. అది భారత రైల్యే శాఖ తరఫున నమోదు కానుంది. జమ్మూ రాష్ట్రంలోని రైసీ జిల్లాలో దేశంలోనే మొట్టమొదటి తీగల రైల్వే వంతెన ప్రారంభానికి సిద్ధంగా ఉంది. కాట్రా, బనిహాల్ మధ్య 111 కిలోమీటర్ల మార్గంలో ఈ ప్రాజెక్టు నిర్మితమవుతోంది. పనులు తుది దశకు చేరుకున్నాయి. 11 నెలల వ్యవధిలోనే ఈ రైల్వే వంతెన నిర్మాణం పూర్తయినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్విట్టర్‌లో వెల్లడించారు. వంతెనను 96 ప్రధాన తీగలతో అనుసంధానించినట్లు తెలిపారు. ఈ తీగల పొడవు మొత్తం 653 కిలోమీటర్లు ఉందని తెలిపారు. ఆ వంతెనకు సంబంధించిన వీడియోను పోస్టు చేశారు.

Read Also:Pakistan vs New Zealand: క్రికెట్ చరిత్రలో అతిపెద్ద తప్పు.. ఇదే తొలిసారి!

చీనాబ్ నదిపై నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు చాలా విశిష్టతలను కలిగిఉంది. గంటకు 213 మైళ్ల వేగంతో వీచే గాలులను సైతం నిరోధించి తట్టుకోగల సామర్థ్యం ఈ వంతెన సొంతం. ఈ తీగల రైలు వంతెనపై100 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించొచ్చు. గాలుల వేగం 90 కిలోమీటర్లు దాటిన సందర్భాల్లో రైళ్లను నిలిపివేస్తారు. వంతెన మధ్య భాగం నది ఉపరితలం నుంచి 331 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ వంతెన అందుబాటులోకి వస్తే కశ్మీర్ వ్యాలీ మొత్తం రైల్వే నెట్ వర్క్ తో అనుసంధానం అవుతుంది.

Read Also:Twitter : ఇక ట్విట్టర్లో న్యూస్ చదవాలంటే డబ్బులు చెల్లించాల్సిందే

ఈ రైల్వే వంతెన పొడవు 725.5 మీటర్లు. దీనికి 2003లో అనుమతులు వచ్చాయి. వంతెన నిర్మాణం 2004లో ప్రారంభించారు. ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే బ్రిడ్జి ఇదే. ప్యారిస్ లోని ఈఫిల్ టవర్ కంటే ఈ వంతెన పొడవు 35 మీటర్లు అధికం. పర్వత ప్రాంతాల నడుమ ఎత్తయిన ప్రదేశంలో ఇది ఉంది. 47 సెగ్మెంట్లకుగాను 41 పూర్తియినట్టు, మిగిలినవి మే నెల మొదట్లో పూర్తవుతాయని ఓ అధికారి తెలిపారు.

Show comments