NTV Telugu Site icon

2492 Carat Diamond : ప్రపంచంలోనే రెండో అతి పెద్ద వజ్రం.. ఎన్ని క్యారెట్లో తెలుసా ?

New Project (76)

New Project (76)

2492 Carat Diamond : కెనడియన్ మైనింగ్ కంపెనీ ఆఫ్రికన్ దేశం బోట్స్వానాలో గొప్ప విజయాన్ని సాధించింది. అది ప్రపంచంలో రెండవ అతిపెద్ద వజ్రాన్ని కనుగొంది. ఈ వజ్రం 2492 క్యారెట్‌లని చెబుతున్నారు. ఈ ఆవిష్కరణ తర్వాత కంపెనీ అధికారులు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రం 119 సంవత్సరాల క్రితం కనుగొనబడింది. ఇది 3041 క్యారెట్లు. శతాబ్దానికి పైగా తర్వాత ఈ విజయం సాధించింది. లుకారా డైమండ్ కార్ప్ బోట్స్వానా గనులలో 2,492 క్యారెట్ల వజ్రాన్ని కనుగొంది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రం అని చెబుతున్నారు. మైనింగ్ కంపెనీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈశాన్య బోట్స్‌వానాలోని కరోవే డైమండ్ మైన్‌లో ఎక్స్‌రే టెక్నాలజీని ఉపయోగించి ఈ వజ్రాన్ని కనుగొన్నట్లు లుకారా డైమండ్ కార్ప్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

Read Also:Money On Roads: ఇదేమి పోయేకాలం.. ట్రాఫిక్‌లో డబ్బులు విసురుతూ రీల్స్.. (వీడియో)

డైమండ్ ధర ఎంత?
లూకారా ఈ ఆవిష్కరణ తర్వాత వజ్రం ధరను ఇంకా వెల్లడించలేదు లేదా వజ్రం నాణ్యత గురించి ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రం 3016 క్యారెట్ కల్లినన్ వజ్రం 1905లో దక్షిణాఫ్రికాలో కనుగొనబడింది. ఈ అసాధారణమైన 2,492 క్యారెట్ల వజ్రం రికవరీ చేయడం పట్ల మేము చాలా సంతోషిస్తున్నాము అని లుకారా ఛైర్మన్ విలియం లాంబ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ వజ్రం అరచేతిలో పట్టేంత పెద్దదిగా ఉందని కంపెనీ విడుదల చేసిన ఫోటోలు తెలియజేస్తున్నాయి.

Read Also:Supreme Court : సుప్రీంకోర్టు ఆవరణలో లాయర్ తొడ కొరికేసిన కోతి

మరోవైపు, ఈ భారీ వజ్రాన్ని గురువారం బోట్స్వానా అధ్యక్షుడు మోక్‌వీట్సీ మసిసికి చూపించారు. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రమని ఆయన ప్రభుత్వం పేర్కొంది. తమ దేశంలోనే ఈ ఆవిష్కరణ జరగడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాల ఉత్పత్తిదారుల్లో బోట్స్వానా ఒకటని.. ఈ దేశానికి ఇది ప్రధాన ఆదాయ వనరు. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే వజ్రాలలో 23 శాతం బోట్స్వానా నుండి వచ్చాయి. దాని జీడీపీలో 30 శాతం, ఎగుమతుల్లో 80 శాతం ఈ వజ్రాల నుంచే ఆదాయం సమకూరుతుంది. బోట్స్‌వానా రాజధాని గాబోరోన్‌కు దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కైరో గని నుంచి ఈ వజ్రం వెలికితీయబడింది.