NTV Telugu Site icon

World Records: వామ్మో .. క్యాండీలను గడ్డానికి గుచ్చి వరల్డ్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు..

Candy Man

Candy Man

గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించాలని చాలా మంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. కొందరు పెద్ద సాహసాలే చేస్తారు.. ఇటీవల గిన్నిస్ రికార్డులో ఎక్కేవారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతున్నారు.. తాజాగా ఓ వ్యక్తి గడ్డంతో గిన్నిస్ లో చోటు సంపాదించాడు.. అదేలా అని ఆశ్చర్యపోతున్నారా? అసలు విషయం వేరే ఉంది.. అసలు విషయం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఇక మరికొన్ని రోజుల్లో ప్రపంచం క్రిస్మస్ జరుపుకోనున్న వేళ అమెరికాకు చెందిన ఓ వ్యక్తి తనలోని అసాధారణ ప్రతిభను బయటపెట్టి గిన్నిస్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.. అతను అమెరికాకు చెందిన జోయెల్ స్ట్రాసర్‌ అనే వ్యక్తి క్రిస్మస్ స్పిరిట్‌తో గడ్డాన్ని పెంచాడు. తాజాగా 187 క్యాండీ కేన్లను తన గడ్డంలో దూర్చి గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టాడు.

ఈ రికార్డును బద్దలు కొట్టడానికి జోయెల్ గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. క్రిస్మస్ సీజన్‌లోనే గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకోవాలని భావించాడు. గత ఏడాది క్రిస్మస్ సీజన్ లోనూ జోయెల్ తన ముఖంపై 710 క్రిస్మస్ బాబుల్స్ ను పెట్టుకుని తన రికార్డును తానే బద్దలు కొట్టాడు.. ఇప్పుడు ఏకంగా తన గుబురు తో రికార్డు బ్రేక్ చేశాడు.. క్యాండిలను గడ్డంలో గుచ్చుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ వీడియోను చూసిన చాలా మంది గ్రేట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.. మరికొందరు ఇలా కూడా చేస్తారా అంటూ రకరకాల కామెంట్స్ తో ఆ వీడియోను ట్రెండ్ చేస్తున్నారు.. ఆ వీడియో పై ఒక లుక్ వేసుకోండి..