NTV Telugu Site icon

K.Bhagyaraj 3.6.9 Movie: గంటన్నరలోపే సినిమా పూర్తి… విడుదలయ్యేది ఎప్పుడంటే?

3.6

3.6

K.Bhagyaraj 3.6.9 Movie:సాధారణంగా సినిమా తీయడానికి నెలలు నెలలు సమయం పడుతుంది. ఇప్పుడైతే పాన్ ఇండియా చిత్రాలంటూ ఒక సినిమా పూర్తి చేయడానికే రెండు మూడు సంవత్సరాలు తీసుకుంటున్నారు. అలాంటిది కేవలం 81 నిమిషాలు అంటే గంటన్నర కంటే తక్కువ సమయంలోనే ఒక చిత్రాన్ని నిర్మించారంటే నమ్ముతారా? అవునండీ ఇది నిజమే. అంతేకాదు విడుదల కాకముందే ఈ సినిమా ప్రపంచరికార్డును కూడా సాధించింది.

అమెరికాకు చెందిన వరల్డ్‌ రికార్డ్‌ యూనియన్‌ అనే సంస్థ ఈ 3.6.9 చిత్రానికి ప్రపంచ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని అందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇంతలా చెబుతున్న ఆఆ సినిమా మరేదో కాదు ఫేమస్ డైరెక్టర్ కె. భాగ్యరాజ్ ప్రధాన ప్రాతలో నటించిన 3.6.9.

Also Read: Jailer Collections: రూ.300 కోట్ల క్లబ్ లోకి చేరనున్న జైలర్..

ఈ చిత్రానికి శివ మాధవ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా చిత్రీకరణకు 24 కెమెరాలను ఉపయోగించారు. ఇందులో బ్లాక్‌ శాండీ, అంగయర్‌ కన్నన్‌, సుకై ల్‌ ప్రభు, కార్తీక్‌ లాంటి 60 మందికి పైగా నటీనటులు ముఖ్యపాత్రలు పోషించగా పీజీఎస్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరో విశేషం ఏంటంటే దీని కోసం 600 మంది సాంకేతిక నిపుణులు పనిచేశారు.

దీనిని నాలెడ్జ్‌ ఇంజినీరింగ్‌ అనే సంస్థకు చెందిన హరిభా హనీప్‌ సమక్షంలో చిత్రీకరించారు.సైన్స్‌ ఇతివృతంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ మూవీ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

 

Show comments